టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సినీ నటుడు వల్లభనేని జనార్దన్ కన్నుమూత
టాలీవుడ్ చిత్రంలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు మరో సినీ ప్రముఖుడు కన్నుమూయడం ఇండస్ట్రీలో అందరిని షాక్ కు గురి చేసింది. పలు సినిమాలలో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న జనార్దన్ నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే గత కొంతకాలంగా కొంత ఆరోగ్యంతో బాధపడుతున్న జనార్ధన్ గురువారం రోజు హఠాత్తుగా కన్నుమూశారు.
ఆయన మరణ వార్త గురించి తెలిసిన తర్వాత ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ప్రముఖ నటుడు మృతి చెందడం సినీ ప్రముఖులను కలచివేస్తోంది. నటుడుగా దర్శకుడిగా అలాగే నిర్మాతగా వల్లభనేని జనార్దన్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును అందుకున్నారు.

63 ఏళ్ల జనార్దన్ గత కొన్ని రోజులుగా కొంత అనారోగ్యంతో ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం రోజు పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయన మృతి చెందారు. జనార్ధన్ తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని మంచి సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రధాన విలన్ గా కనిపించి ఆ సినిమా విజయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి.
మొదట జనార్ధన్, చంద్రమోహన్ తో అమాయక చక్రవర్తి అనే సినిమాను రూపొందించారు. శోభన్ బాబు హీరోగా హిందీ సినిమాను తెలుగులో తోడు నీడ పేరుతో రూపొందించారు. అంతేకాకుండా ఆయన కూతురు శ్వేత పేరు మీద ఆయన ఒక చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఇక ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన కన్నుమూయడంతో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











