అప్పట్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉండేది.. ఎలా అడిగేవారు అంటే.. సీనియర్ నటి ఆమని

సినిమా ఇండస్ట్రీలో చిరకాలం నిలిచిపోయే నటీనటులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక అలాంటి అందమైన తెలుగు నటీమణుల్లో ఆమని ఒకరు. 90లో కాలంలో ఎన్నో మంచి సినిమాలు చేసే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న ఆమె తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమని హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు తెలియజేసింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి కూడా తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్

అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్

90ల కాలంలో హీరోయిన్స్ మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగానే ఉండేది. అయితే అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ కూడా చాలా ఎక్కువగానే ఉండేది అని కొంతమంది హీరోయిన్స్ చెబుతున్నారు. మంచివాళ్లతో పాటు ఇండస్ట్రీలో కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉండేవారు అని అయితే వారి నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నామో అనే విషయాలను కూడా చాలామంది ఓపెన్ గా తెలియజేస్తున్నారు.

 మంచి హోమ్లీ నటిగా

మంచి హోమ్లీ నటిగా

ఇక సీనియర్ నటి ఆమని కూడా ఆ చేదు అనుభవాలను గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. శుభలగ్నం, మావిచిగురు అనే సినిమాలతో మంచి హోమ్లీ నటిగా గుర్తింపు అందుకున్న ఆమని ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా దగ్గర అయింది. అంతేకాకుండా జంబలకడిపంబ మిస్టర్ పెళ్ళాం అనే సినిమాలతో కూడా మంచి కామెడీ రోల్స్ చేసి మెప్పించారు.

కమర్షియల్ సినిమాలలో..

కమర్షియల్ సినిమాలలో..


సాధారణ గృహిణి పాత్రలలో అయితే ఆమని అప్పట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవారు. ఇక తర్వాత కొన్ని కమర్షియల్ సినిమాలలో ఆమె గ్లామరస్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం ఆమని యువ హీరోల సినిమాలలో తల్లి పాత్రలలో అలాగే సపోర్టింగ్ పాత్రలతో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

 స్టూడియోలు చుట్టూ తిరిగాను

స్టూడియోలు చుట్టూ తిరిగాను

అయితే 90ల కాలంలో కూడా కొన్ని క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉండేవి అని ఆమని వివరంగా తెలియజేశారు. మొదట్లో అవకాశాల కోసం కొన్ని స్టూడియోలు చుట్టూ కూడా తిరిగాను. అయితే మంచి వాళ్ళతో పాటు కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉండేవారు. చాలా ఆడిషన్స్ లో నేను పాల్గొన్నాను. కొంతమంది నన్ను కావాలని కూడా సెలెక్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత ఫోన్ చేసి అర్థం లేకుండా మాట్లాడేవారు.

 బీచ్ కు రమ్మని..

బీచ్ కు రమ్మని..

ఒక మేనేజర్ ఫోన్ చేసి మీకు సినిమాలో అవకాశం కావాలి అంటే బీచ్ కి వస్తారా అని అడిగాడు. నేను ప్రాజెక్ట్ కోసమేమో అనుకొని మా అమ్మ గారితో వస్తాను అని చెప్పాను. కానీ అతను మీ అమ్మగారు రాకూడదు మీరు ఒక్కరు మాత్రమే రావాలి. అలా అయితేనే సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు అని అనేవారు. మొదట్లో నాకు అర్థం కాలేదు కానీ అతని ఆలోచన విధానం గురించి తెలియడంతో ప్రశ్నించాను. ఇలా ఉంటే ఇండస్ట్రీలో ఉండరు అని అతను అనడంతో షాకయ్యాను.

 కమిట్మెంట్ గురించి అడిగారు

కమిట్మెంట్ గురించి అడిగారు


కొంతమంది డైరెక్ట్ గా అడగకుండా ఇన్ డైరెక్ట్ గా కూడా కమిట్మెంట్ గురించి అడిగారు. కానీ నేను అలాంటి వారికి మొదట్లోనే చాలా దూరంగా ఉంటూ వచ్చాను. ఇండస్ట్రీలో అలాంటి వారు మాత్రమే కాకుండా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రూట్ లోనే నేను నా ప్రయత్నాలు చేసి అవకాశాలను అందుకున్నాను. వీలైనంతవరకు మనం ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండాలి అని ఆమని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X