twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పటికి అలీ జీరో.. అబద్దం అని అనుకున్నాడు.. షాక్ నుంచి తేరుకుని!

    |

    స్టార్ కమెడియన్ అలీ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తనదైన శైలిలో కామెడీ పంచులు పేల్చుతూ హాస్యాన్ని పండిస్తాడు. అలీ కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలీ కమెడియన్ గా కెరీర్ ఆరంభించాడు. కానీ హీరోగా నటించిన యమలీల చిత్రమే అలీ క్రేజ్ ని అమాంతం పెంచేసింది అని చెప్పొచ్చు. యమలీల చిత్రం తర్వాత అటు హీరోగా, కమెడియన్ గా అలీ టాలీవుడ్ లో దూసుకుపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యమలీల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    హాస్యానికి పెద్ద పీట

    హాస్యానికి పెద్ద పీట

    హాస్యానికి ప్రాధాన్యతనిచ్చే టాలీవుడ్ దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉంటారు. కేవలం హాస్యభరితమైన చిత్రాలే కాదు.. కుటుంబ కథా చిత్రాలని కూడా అద్భుతంగా తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో యమలీల చిత్రం గురించి వివరించారు. అప్పటికి ఏమాత్రం ఇమేజ్ లేని అలీని హీరోగా ఎంచుకోవడంపై వివరణ ఇచ్చారు.

    ట్రైన్‌లో ఆలోచన

    ట్రైన్‌లో ఆలోచన

    తాను ఓ రోజు తన ఊరికి వెల్ళడం కోసం రైలు ప్రయాణం చేశాను. ట్రైన్ లో పడుకుని ఉండగా ఆ శబ్దానికి ఏదో పైనుంచి పడుతున్నట్లు అనిపించింది. ఒకవేళ ఊహించని విధంగా మనం ఒంటరిగా ఉన్న సమయంలో ఆకాశం నుంచి ఏదైనా పడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అదే యముడి పుస్తకం పైనుంచి పడితే, దానిద్వారా భవిష్యత్తు మొత్తం తెలిసిపోతే ఈ తరహా ఆలోచనలో యమలీల కథని సిద్ధం చేశానని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

    అబద్దం చెబుతున్నాని

    అబద్దం చెబుతున్నాని

    యమలీల చిత్రం ఏడాది కాలం పాటు దిగ్విజయంగా ఆడిందని ఎస్వీ కృషారెడ్డి తెలిపారు. ఓ రోజు అలీని పిలిచి యమలీల చిత్రంలో హీరోగా నటించాలని అడిగా. నేను అబద్దం చెబుతున్నాని నమ్మలేదు. కాసేపు షాక్ లో ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకుని మళ్ళీ నిజమా అని అడిగాడు. అలీ అప్పుడప్పుడే చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదుగుతున్నాడని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.

    అలీ అప్పటికి జీరో

    అలీ అప్పటికి జీరో

    యమలీల చిత్రం ముందు వరకు అలీ జీరో అని ఎస్వీ కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. యమలీల చిత్రం తర్వాత అలీకి హీరోగా, కమెడియన్ గా వరుస అవకాశాలు వచ్చాయి. యమలీల చిత్రాన్ని అలీ తన భుజాలపై వేసుకుని నడిపించాడని ప్రశంసించారు. యమలీల చిత్రానికి ఎలాంటి ఇమేజ్ లేని హీరో కావాలని అనుకున్నా. అందుకే అలీని ఎంపిక చేసుకున్నట్లు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.

    English summary
    Tollywood Senior Director S V Krishna Reddy About Yamaleela Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X