twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరేళ్ళ తరువాత సీతయ్య డైరెక్టర్ సరికొత్త లవ్ స్టొరీ.. కోట్ల రూపాయలు నష్టపోయినా పట్టు వదల్లేదు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మంచి దర్శకుల్లో వైవిఎస్. చౌదరి ఒకరు. కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా ఒక సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం చూసేలా తెరకెక్కిస్తుంటారు. అలాంటి దర్శకుడు యాక్షన్ చెప్పి దాదాపు ఆరేళ్లవుతోంది. ఇక ఫైనల్ గా ఇన్నాళ్లకు తన పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఒక లవ్ స్టోరీతో రాబోతున్నారట.

    వారితో మొదలైన ప్రయాణం

    వారితో మొదలైన ప్రయాణం

    20 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వైవిఎస్.చౌదరి చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశారు. సహాయక దర్శకుడిగా ఉన్నప్పుడు గుణశేఖర్, రవితేజ వంటి వారితో కలిసి రూమ్ కూడా షేర్ చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళందరు కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. కలిసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు.

    ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు

    ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు

    ఇక వైవిఎస్.చౌదరి వైవిఎస్.చౌదరి హరికృష్ణ తో చేసిన సీతయ్య సినిమా అప్పట్లో బారి విజయాన్ని అందుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో.., యువరాజు, సీతారామరాజు, వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.

    దేవదాసు.. బాక్సాఫీస్ హిట్

    దేవదాసు.. బాక్సాఫీస్ హిట్

    ఎక్కువగా తన హోమ్ ప్రొడక్షన్ బొమ్మరిల్లు సంస్థలోనే సినిమాలను నిర్మిస్తు డైరెక్షన్ చేసేవారు. ముఖ్యంగా రామ్ పోతినేని నటించిన మొదటి సినిమా దేవదాసు వైవిఎస్.చౌదరి దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఆ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. రామ్, ఇలియానా కెరీర్ లకు కూడా బాగానే హెల్ప్ అయ్యింది.

    ఆ సినిమాలు దెబ్బ కొట్టడంతో..

    ఆ సినిమాలు దెబ్బ కొట్టడంతో..

    అయితే మధ్యలో కొన్ని సినిమాల వల్ల వైవిఎస్.చౌదరి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలకృష్ణ ఒక్క మగాడు, మంచు విష్ణు సలీమ్ సినిమాలు దారుణంగా దెబ్బకొట్టాయి. అనంతరం నిప్పు, రేయ్ సినిమాలు కూడా వైవిఎస్.చౌదరి కెరీర్ పై ప్రభావం చూపించాయి.

    మరొక లవ్ స్టోరీతో..

    మరొక లవ్ స్టోరీతో..

    రేయ్ అనంతరం మళ్ళీ సినిమాలు చేయని వైవిఎస్.చౌదరి ఇన్నాళ్లకు మరొక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నేటి తరానికి అర్ధమయ్యేలా సరికొత్త లవ్ స్టోరీని సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నేడు వైవిఎస్.చౌదరి పుట్టినరోజు కావడంతో ఆయన మళ్ళీ ఫామ్ లోకి రావాలని అభిమానులు ప్రేక్షకులు విషెస్ అందిస్తున్నారు.

    English summary
    YVS chowdary was once one of the best directors to receive back-to-back hits in the Tollywood industry. Regardless of the concept, a movie is screened for the entire family audience to see. It’s been almost six years since such a director said action. And finally said good news on the occasion of his birthday for years to come. Coming soon with a love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X