twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    VidyaSagar: టాలీవుడ్​లో మరో విషాదం.. సీనియర్​ హీరో కన్నుమూత

    |

    ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కాలం చేస్తున్నారు. ఒక మరణవార్తను మరిచిపోయేలోపే.. మరోకరు తనువు చాలించారనే వార్త వినాల్సి వస్తోంది. దీంతో సినీ పెద్దలు, ప్రముఖుల దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇవాళ అంటే ఆగస్టు 28న టాలీవుడ్ డైరెక్టర్​ బాబీ తండ్రి మోహన్​ రావు కాలేయ సంబంధిత వ్యాధితో మరణించారు. ఈలోపే టాలీవుడ్​ సీనియర్​ హీరో విద్యాసాగార్​ కన్నుమూశారు. దీంతో చిత్రసీమలో విశాద ఛాయలు నెలకొన్నాయి.

     కలచివేస్తున్న మరణాలు..

    కలచివేస్తున్న మరణాలు..

    చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీనియర్​ హీరోయిన్​ మీనా భర్త విద్యా సాగర్ మరణించగా, ఆ వెంటనే ప్రముఖ సీనియర్ ఫిల్మ్​ ఎడిటర్​ గౌతమ్​ రాజు, అనంతరం నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్​, ఆర్​ నారాయణ మూర్తి తల్లి కూడా మరణించారు. వీరి మరణ వార్తలు సినీ లోకాన్ని కలిచివేశాయి. తాజగా మరో విషాదం చోటుచేసుకుంది. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన నటుడు, హీరో విద్యాసాగర్​ అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లు సమాచారం.

    అనుకోకుండా పక్షవాతం..

    అనుకోకుండా పక్షవాతం..


    ఈ చదువులు మాకొద్దు అనే సినిమాతో హీరోగా పరిచయమై, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాసాగర్. ఆ తర్వాత కామెడీ సినిమాలకు పెట్టింది పేరయినటువంటి జంధ్యాల తెరకెక్కిన అనేక సినిమాల్లో విద్యాసాగర్ నటించారు. హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత విద్యాసాగర్​కు అనూహ్యంగా పక్షవాతం వచ్చింది. దీంతో ఒక కాలు, ఒక చేయి పనిచేయకుండా పోవడంతో విద్యా సాగార్​ వీల్​ చెయిర్​కే పరిమితం కావాల్సి వచ్చింది.

     వీల్ చెయిర్​లో కూర్చొని కూడా..

    వీల్ చెయిర్​లో కూర్చొని కూడా..

    ​అయితే అలా వీల్​ చెయిర్​కు పరిమితమైన విద్యాసాగర్​ సినిమాలపై మక్కువతో అలా వీల్​ చెయిర్​లో కూర్చోని మరి చిత్రాల్లో నటించి మెప్పు పొందారు. కాగా విద్యాసాగర్​ ఎలా మరణించారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, విద్యాసాగర్​ మరణించారనే విషయాన్ని సినీ నటుడు జోష్​ రవి సోషల్​ మీడియా వేదికగా తెలిపాడు. 'ఆయన ఒక మంచి నటుడు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలి' అని రాసుకొచ్చాడు. దీంతో ఆయమ మరణం పట్ల పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జెమినీ సురేష్​తోపాటు పలువురు నెటిజన్లు నివాళులు అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు.

    English summary
    Tollywood Senior Hero Actor Vidyasagar Passed Away. And He Gave Debut As Hero With Ee Chaduvulu Makoddu Movie. Vidyasagar Mostly Acted In Jandhyala Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X