Jeevitha Rajashekar love story: "పెళ్లి కాకముందే ఇద్దరం ఒకే రూంలో ఉండేవాళ్లం"
Jeevitha Rajashekar: తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్స్ కపుల్స్ లో జీవిత రాజశేఖర్ జంట ఒకటి. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు. జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత.. అనేలా చాలా చాలా అన్యోన్యంగా కలిసి ఉంటారు. వీరు ఎక్కడ కనిపించిన జంటగానే కనిపిస్తారు. తాజాగా సీనియర్ హీరోయిన్ జీవిత తమ లవ్ స్టోరీని బయటపెట్టారు. వీరి లవ్ స్టోరీ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. వీరి లవ్ సోర్టీలో ఛేజింగ్స్, ఫైట్ సీన్స్ లేకున్నా.. అదిరిపోయే, దిమ్మతిరిగిపోయే ట్విస్టులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వీరి మధ్య పరిచయంగా కూడా చాలా వింతగా జరిగిందంట. ఆ ట్వీస్టులేంటో.. ఆ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
నటి జీవిత రాజశేఖర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తాను ప్రతి విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాననీ, ప్రతివారిని అనుకూలంగా ఉంటాను. అందుకే తన బంధాన్ని ఎవరూ దూరం చేసుకోలేరు. ఈ విషయమే రాజశేఖర్ కు చాలా నచ్చింది. ఆయన చూట్టు ఎంతో మంది అమ్మాయిలు, ఫ్యాన్స్ తిరుగుతుంటారు.ఆయనకు కాల్స్ చేసి మాట్లాడుతుంటారు. కానీ నేను ఏ రోజు కూడా ఇన్ సెక్యూర్ గా ఫీల్ కాలేదు. రాజశేఖర్ అప్పుడు ఇప్పుడు కూడా ప్రతి విషయాన్ని తనకు ఖచ్చితంగా చెప్పాడు. ఒకవేళ ఓ అమ్మాయి తనకు ఫోన్ చేసి రమ్మని అడిగా ఆ విషయాన్ని కూడా తనో చెప్పారు. మా రిలేషన్ అలాంటి' అని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత నటి జీవిత తన లవ్ సోర్టీ చెబుతూ..' తాము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కానీ, పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి. ఎవరూ పెళ్లి వ్యతిరేకించకూడదని ఫిక్స్ అయ్యాం. ఈ క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం ' అని చెప్పుకొచ్చారు. 'నవ భారతం సినిమా సమయంలో తామిద్దరం పెళ్లి కాకున్నా ఇద్దరం ఒకే రూంలో ఉండే వారిమి. ఆ టైంలో ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ అయ్యాం. చాలా మంది మా గురించి మాట్లాడుకునే వారు. మీడియాలో కూడా మాపై వార్తలు వచ్చేవి. ఆ విషయం మా పేరెంట్స్ తెలిసి చాలా బాధపడ్డారు'అని చెప్పుకొచ్చింది.
'పెళ్లి చేసుకున్నా లేకున్నా మా రిలేషన్స్ అలానే ఉంటుందని, ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మా బంధంలో ఎలాంటి మార్పు ఉండదు' అని తన తల్లిదండ్రులకు ముందే చెప్పేశానని అన్నారు. 'వచ్చే అమ్మాయి తమ రిలేషన్ అర్థం చేసుకుంటే.. రాజశేఖర్ కు ఫ్రెండ్ గానే ఉంటా. ఆయనను సోల్మెట్ గా ఫిక్స్ అయ్యాను' అని షాకింగ్ విషయాలను వెల్లడించింది.
జీవిత ఇంకా మాట్లాడుతూ.. 'మేమిద్దరం రిలేషన్ లో ఉండగానే.. రాజశేఖర్ కు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అందులోనూ ఆ అమ్మాయి ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తుంది. కానీ ఆమె యాకర్ట్ కాదు. కానీ రాజశేఖర్ కు ఆ అమ్మాయి నచ్చలేదు. మ్యారేజ్ ఫిక్స్ అయినా విషయాన్ని రాజశేఖర్ ఫ్రెండ్స్, రిలేషల్స్ నా దగ్గరకు చెప్పారు. ఇలాంటి సంఘటన ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించాను. అందుకు తగ్గట్టుగా ముందుగానే ప్రిపేర్ అయ్యాను. అయినా చాలా పెయిన్ పుల్ గా ఫీలయ్యాను'అని ఎమోషనల్ అయ్యారు.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమింటంటే.. ఆ అమ్మాయి జీవిత సీనియర్ అంట. ఈ క్రమంలో జీవిత ఓ ఘటన గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు." రాజశేఖర్ ను పెళ్లి చేసుకునే ఆ అమ్మాయి ఆయనను గుడికి తీసుకవెళ్లామని అడిగింది. ఆయనకు కూడా అందుకు ఒకే చెప్పి తనని కూడా రమ్మన్నాడు. ఆయనకు అప్పట్లో ఓ అంబాసిడర్ కారు ఉండేది. ఎప్పుడు తాను ముందు సీట్లో ఆయన పక్కనే కూర్చొనే దాని. కానీ ఆ రోజు ఆ అమ్మాయి వచ్చాక వారిద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. నేను వెనకాల కూర్చున్నాను.ఆ విషయం నన్ను బాధకు గురించి చేసింది." అంటూ ఎమోషనల్ అయ్యారు నటి జీవిత.

'ఆ తరువాత మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసింది. ఈ క్రమంలో చాలా గొడవలయ్యాయి. దీంతో రాజశేఖర్ ఓపెన్ అయ్యారు.జీవితను దూరం పెట్టడం తన వాళ్ల కాదు' అని తెగేసి చెప్పేశారు. దీంతో ఆ మ్యారేజ్ కాన్సిల్ అయ్యిందని అన్నారు. ఆ తరువాత తామిద్దరం కలిసి నటించి ఓ సినిమాలో యాక్సిటెంట్ జరిగిందనీ, దీంతో రాజశేఖర్ దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండిపోయారనీ. అలా మా బంధం మరింత స్ట్రాంగ్ గా మారిందనీ. అనంతరం 1991లో పెళ్లి చేసుకున్నామని నటి జీవిత తన లవ్ సోర్టీలోని ట్విస్టులను బయటపెట్టింది.


Click it and Unblock the Notifications











