ముదురు భామలు వరసపెట్టారు (ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : కనీసం ఈ ఇన్నింగ్స్‌లో అయినా.. సక్సెస్ అవుతామా...ఇప్పుడు చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతున్న హీరోయిన్స్ కు ఇదే సందేహం పలకరిస్తోంది. 'ఇక కొత్తవాళ్ల ధాటికి తట్టుకోలేరు...' అనుకొని వాళ్లని పక్కన పెట్టేసిన సినీ పరిశ్రమ మళ్లీ వాళ్లనే వెతుక్కొంటూ వెళ్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ముదురు హీరోయిన్స్ సెట్స్ పై కనిపించి అలరిస్తున్నారు.

సీనియర్ హీరోల పక్కన హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవడం ఇప్పుడు కష్టతరంగా మారింది. సీరియర్‌ హీరోల పక్కన నేటి హీరోయిన్స్ మరీ చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు. వాళ్ల నటనతో సరితూగే శక్తి ఉండడం లేదు. అందుకే మన దర్శకులు కాస్త వెనక్కి వెళ్లి హీరోయిన్స్ ని వెతికే కార్యక్రమంలో దిగుతున్నారు.

అసలు సినిమాల్లో రీ ఎంట్రీ అనేది ఉండనే ఉండదనేది కొంతమంది మాట. 'మేం పరిశ్రమలోనే ఉన్నాం కదా..? వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. మధ్యలో ఓ విరామం వచ్చిందంతే...' అంటుంటారు. అదీ నిజమే. అవకాశాలు రావడం, రాకపోవడం ఎవరి చేతుల్లోనూ లేని విషయం. వచ్చినప్పుడు ఒడిసిపట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే ముఖ్యం కూడా.

అలా రీ ఎంట్రీలమీద రీ ఎంట్రీలు ఇచ్చిన హీరోయిన్స్ మళ్లీ రాణిస్తున్నారా? లేదా? అనేది తరువాతి ప్రశ్న. కానీ ఫేడవుట్‌ అయిపోయిన దశలోంచి మళ్లీ లైమ్‌ లైట్‌ లోకి రావడం కచ్చితంగా ఈ ముదురు భామల ఘనతే అంటోంది సినీ పరిశ్రమ. ఇంద్రజ మళ్లీ నటిస్తోంది. సిమ్రాన్‌కి పిలుపొచ్చింది. రమ్యకృష్ణ రీ ఎంట్రీ.. ఇలా మళ్లీ అందరూ బిజీ అవుతున్నారు.

రీఎంట్రి ఇస్తున్న హీరోయిన్స్ ... స్లైడ్ షోలో...

త్రిష

త్రిష

'త్రిష పని అయిపోయింది..' అనుకొన్నారంతా. ఇది ఇప్పటి మాట కాదు. గత నాలుగేళ్ల నుంచీ త్రిష పేరు వినగానే వినిపించే కామెంట్‌ అదే. కానీ ఆమె మూటా ముళ్లూ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోలేదు. 'దమ్ము'లో నటించింది కదా..? ఆ తరవాత మళ్లీ గ్యాప్‌! మధ్య మధ్యలో తమిళ సినిమాలు చేస్తూనే ఉంది. 'రమ్‌'లో నటించింది. అయితే ఆ సినిమా అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మరో సినిమా చేజిక్కించుకొంది. అదీ.... నందమూరి బాలకృష్ణ పక్కన.

శ్రియ

శ్రియ

శ్రియని వెండి తెరపై చూసి ఎన్నాళ్లయ్యిందో..? ఆ లోటు 'మనం' సినిమా తీర్చింది. 'మనం'లో శ్రియ నటనకు ప్రత్యేకమైన ప్రసంశలు దక్కకపోవచ్చు. కానీ... ఈ విజయం ఆమెలో కొత్త శక్తి నింపుతుందన్న విషయంలో సందేహం లేదు. 'ఓమైగాడ్‌' రీమేక్‌లో ఇప్పుడు శ్రియ పేరు వినిపిస్తోంది. వెంకటేష్‌ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మీనా

మీనా

వెంకీ... హీరోగా నటించిన 'దృశ్యం'లో మీనానే హీరోయిన్ . ఇది మలయాళ చిత్రానికి రీమేక్‌. అక్కడా మీనానే నటించింది. అందుకే... ఆమెని ఎంపిక చేసుకొన్నారు. చిత్రీకరణ కూడా పూర్తయింది.

ఇంద్రజ

ఇంద్రజ

అజయ్‌ పక్కన ఓ సినిమాలో ఇంద్రజని ఎంపిక చేసుకొన్నారు. దిక్కులు చూడకు రామయ్య టైటిల్ తో రూపొందే చిత్రంలో ఆమెను తీసుకున్నారు. రాజమౌళి శిష్యుడు కోటి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

సదా

సదా

'జయం'లో 'వెళ్లవయ్యా వెళ్లూ' అని ఆటపట్టించిన సదా ఇప్పుడు మళ్లీ మెరవబోతోంది. 'యమలీల 2'లో ఆమెకో కీలక పాత్ర దక్కింది. ఈ సినిమాలో దేవకన్యగా కనిపించబోతోంది. ఆమెపై ఓ పాటని కూడా తెరకెక్కించారు.

మధురిమ

మధురిమ

అల్లు శిరీష్ నటించిన 'కొత్తజంట'లో మధురిమ ఓ పాటలో ఆడిపాడింది. 'ఆ అంటే అమలాపురం' అంటూ చిందులు వేసింది. ఏ పాటతో ఎవరి జాతకం మారుతుందో ఎవరు చెప్పగలరు..? ఇలాంటి పాటలతోనే హంసానందిని ఫేటు మారిపోయింది. మరి మధురిమ కెరీర్‌ కూడా ఈ పాటతో టర్న్‌ తీసుకొంటుందా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

రేవతి

రేవతి

గతంలో వెంకటేష్ తో ప్రేమ, జగపతిబాబుతో గాయం వంటి చిత్రాలతో నటించి ప్రశంసలు అందుకున్న రేవతి మరోసారి రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె మళ్లీ వర్మ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది.

నదియా

నదియా

ఇప్పటికే సీనియర్ హీరోయిన్...నదియా...అత్తారింటికి దారేది చిత్రంలో నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు దృశ్యం చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా కీలకమైన పాత్రను చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X