టాలీవుడ్ సెక్స్ స్కాం : దొరికిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్

By Bojja Kumar

హైదరాబాద్ : సినిమా రంగంలో కొత్తగా హీరోయిన్‌గా రాణించాలనుకునే అమ్మాయిలు.....సెక్సువల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తమకు పడక సుఖం ఇస్తేనే సినిమా అవకాశాలు ఇస్తాం అంటూ బేరమాడే దర్శక, నిర్మాతలు కూడా సినిమా రంగంలో చాలా మంది ఉన్నారు.

కొందరు దర్శకులు, నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం కోసం సెక్స్ సుఖం కోరతారనే విషయాన్ని గతంలో పలువురు స్టార్ హీరోయిన్లు కూడా బయట పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు లీడింగ్ న్యూస్ ఛానల్ టాలీవుడ్లో ఈ భాగోతాన్ని బయట పెట్టేందుకు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది.

కొత్తగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకునే యువతులకు....కాంమాంధ దర్శక, నిర్మాతలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును సదరు టీవీ ఛానల్‌కు చెందిన లేడీ రిపోర్టర్లు కలిసారు. యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన కాలేజీ విద్యార్థులుగా పరిచయం చేసుకుని తమకు అవకాశాలు ఇప్పించాలని కోరారు.

తాను చెప్పినట్లు వింటే మీకు తప్పకుండా అవకాశాలు వస్తాయని సదరు క్యారెక్టర్ ఆర్టిస్టు వారిని నమ్మ బలికింది. వారిని తీసుకుని ఓ ప్రముఖ సినీ ఫైనాన్సియర్ గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లింది. అప్పడ అప్పటికే ఓ దర్శకుడు, నిర్మాత ఉన్నారు. ఈ వ్యవహారాన్నంతా సదరు మహిళా రిపోర్టర్లు రహస్య కెమెరాతో షూట్ చేసారు. వీరు రిపోర్టర్లు అనే అనుమానం రావడంతో వెంటనే సదరు దర్శకుడు, నిర్మాత గోడదూకి పారిపోయారు. ఈ వ్యవహారంతో.....టాలీవుడ్లో చాలా కాలంగా సెక్స్ స్కాం జరుగుతోందని, అవకాశాల కోసం వచ్చే వారి బలహీనతను అడ్డం పెట్టుకుని కొందరు దర్శకులు, నిర్మాతలు తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారని స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X