»   » డెక్కన్ చార్జర్స్ కు ఇలియానా అందాల విందు!

డెక్కన్ చార్జర్స్ కు ఇలియానా అందాల విందు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐపీయల్ లో అన్ని టీమ్ ఓనర్స్ తమ టీమ్ క్రికెటర్లకు అందాల భామలను ఎరగా వేలయాలని అనుకుంటున్నారు..ఇప్పటికే ప్రీతిజింతా, శిల్పాశెట్టి ఓనర్ అండ్ అంబాసిడర్ గా ఉంటే రీసెంట్ గా దీపికా పదుకునె కూడా అంబాసిడర్ గా చేరి తన టీమ్ క్రికెటర్లలో ఉత్సాహాన్ని నూరిపోస్తుంది.

ఇదంతా చూసిన హైదరాబాద్ జట్టు ఓనర్స్ కూడా టాలీవుడ్ నుండి నాగార్జునను, రామ్ చరణ్ తేజ ని సంప్రదించగా బహుశా సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ వలన వారి నుండి ఇప్పటటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు. అందుకే ఓ హీరోయిన్ వేటలో పడింది. వేటాడి ఓ జింకను పట్టుకున్నట్లుగా టాలీవుడ్ భామ ఇలియానాను జట్టుకు ఎరగా వేయాలని డెక్కన్ చార్జర్స్ టీమ్ ఓనర్ డిసైడ్ అయ్యారట. ఈ వయ్యారి భామను చూసిన డెక్కన్ చార్జర్స్ మంచి ఊపుతో ఐపీయల్ లో విజయం సాధిస్తారని భావిస్తున్న టీమ్ ఓనర్, ఇలియానా అడిగినంత ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వ్యాపారం మీద దృష్టిపెడుతున్న ఇలియానా కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఫుల్ గా డబ్బు సంపాదించే మార్గంలో ఉందని సమాచారం. అయితే ఇప్పటికే దీపికా పదుకునె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జట్టు ఓనర్ కొడుకును తన చూపులతో కట్టిపడేసినట్టుగా ఇలియానా కూడా ఒక్కసారే సెటిల్ అవ్వడానికి అటువంటి పని చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు..క్రికెట్ తెలిసిన సినిమా పండితులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu