టాలీవుడ్ సింగర్ ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వే ట్రాక్ మీద తండ్రి డెడ్ బాడీ.. అసలు ఏం జరుగుతోంది?

టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నేపథ్య గాయని అయిన హరిణి కుటుంబం మొత్తం అదృశ్యం కావడం సంచలనంగా మారింది. అయితే ఆమె కుటుంబం ఇంకా వెలుగులోకి రాలేదు కానీ హరిణి తండ్రి ఏకే రావు మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. బెంగళూరులోని ఒక రైల్వే ట్రాక్ మీద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే

 కుటుంబం మొత్తం మిస్సింగ్

కుటుంబం మొత్తం మిస్సింగ్

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నేపథ్య గాయని హరిణి కుటుంబం మొత్తం కూడా కనిపించకుండా పోయింది. వారం రోజుల నుంచి వారిని కుటుంబ సభ్యులు కనిపించడం లేదని తెలుస్తోంది. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెబుతున్నారు. వారం రోజుల నుంచి వారిని కుటుంబ సభ్యులు కనిపించకుండా పోగా వారం నుంచి వారి ఎలాంటి క్షేమ సమాచారాలు సైతం అందడం లేదు.

 రైల్వే ట్రాక్ మీద

రైల్వే ట్రాక్ మీద

అయితే అనూహ్య రీతిలో గురువారం నాడు హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగుళూరు లోని ఒక రైల్వే ట్రాక్ మీద పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో రావు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరి నడుపుతున్న సుజనా ఫౌండేషన్ కు సీఈఓ గా పని చేస్తున్నారు. అలాగే సుజనా గ్రూప్ కి సంబంధించిన వ్యాపారాలకు లీగల్ అడ్వైసర్ గా కూడా పని చేస్తున్నారు.

కత్తి గాట్లు

కత్తి గాట్లు

ఏకే రావు మృతదేహం మీద కత్తి గాట్లు కూడా ఉన్నాయని గుర్తించిన పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక హరిణి విషయానికి వస్తే ఆమె ఒక నేపథ్య గాయని మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె తన సేవలు అందించారు. క్లాసికల్ డాన్సర్ గా కూడా ఆమె సాహితీ ప్రియులకు సుపరిచితమే.

3500 పైబడి పాటలు

3500 పైబడి పాటలు

తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో సుమారు 3500 పైబడి పాటలు పాడిన హరిణి ఎక్కువగా తమిళ సినీ ఇండస్ట్రీలోనే పాటలు పాడారు. తన తోటి సింగర్ అయిన టిప్పుని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన మురారి సినిమా లోని ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక, గుడుంబా శంకర్ లోని ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఘర్షణ సినిమాలో అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుడు శీను లోని నీలి నీలి నీలి నీలి కన్నుల్లో నా ఇలాంటి పాటలు ఆలపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Recommended Video

Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu
పోస్టుమార్టం

పోస్టుమార్టం

జో అచ్యుతానంద సినిమాల్లో ఆమె పాడిన ఒక పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతానికి ఏ.ఎస్.రావు మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు పోస్టుమార్టం వివరాలు వెల్లడి అయితే ఈ హత్య ఎలా జరిగింది అనే విషయం మీద కొంత అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ కె రావును హత్య చేయాల్సిన అవసరం అవకాశం ఎవరికి ఉంటుంది? అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద ఆయన కుటుంబ సభ్యులు వెలుగులోకి వచ్చి ఏమైనా చెబితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X