ఘనంగా సింగర్ మాళవిక వివాహం

పెళ్లికి కొన్ని గంటల ముందే శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ నిర్వహించారు. సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తెల్లవారు ఝామున వివాహం జరిగిందని, బంధమిత్రులు, ప్రముఖులు హాజరయ్యారని మాళవిక కుటుంబ సభ్యులు తెలిపారు.
గంగోత్రి సినిమాలో 'నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం' పాటతో కెరీర్ ప్రారంభించిన మాళవిక అనతి కాలంలోనే మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. అనేక తెలుగు సినిమాలతో పాటు మళయాలం, కన్నడ సినిమాల్లో కూడా ఆమె తన స్వయం వినిపించింది. అంతేకాకుండా గాయనిగా రెండు నంది అవార్డులు అందుకుంది.


Click it and Unblock the Notifications











