బ్రేకింగ్.. సింగర్ మంగ్లీకి గాయాలు.. అసలు ఏం జరిగిందంటే?
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బతుకమ్మ, బోనాలు, గణేష్ చతుర్థి, సమ్మక్క సారక్క, శివుడిపై ఎన్నో పాటలు పాడి చాలా ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ సినిమా సాంగ్స్ కూడా అదరగొడుతుందన్న విషయం తెలిసిందే. ఆమె పాడే పాటలకు యూట్యూబ్ లో అతి కొద్ది సమయంలోనే మిలియన్ల వ్యూస్ అందుకుంటాయి. సినిమా, జానపద గేయాలతో ఫుల్ బిజీగా మారిన సింగర్ మంగ్లీ తాజాగా గాయాలు పాలైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సింగర్ చాలా పాపులర్ అయిన మంగ్లీ అసలు పేరు సత్యవతి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తండాలో పేద బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అలా మొదలైన ఆమె ప్రయాణం తెలంగాణలో పల్లె పాటలకు పెట్టింది పేరుగా నిలిచింది. తర్వాత యాంకర్ గా సింగర్ గా పేరు తెచ్చుకుంది మంగ్లీ. ఇక రేలా.. రేలా.. రే పాటతో సెలబ్రిటీ సింగర్ గా మారిపోయింది.

భక్తి పాటలే కాకుండా సినిమాల్లో సింగర్ మంగ్లీ పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రవితేజ ధమాకాలోని జింతాక్కా, అల వైకుంఠపురములోని రాములో రాములా, జార్జ్ రెడ్డి సినిమాలో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, శైలజా రెడ్డి అల్లుడు చూడే వంటి పాటలతో యమ క్రేజ్ అందుకుంది. సింగర్ గానే కాకుండా స్వేచ్ఛ, గువ్వ గోరింక, నితిన్ మాస్ట్రో సినిమాల్లోనూ నటించింది మంగ్లీ. ఇక ఇటీవలే ఆమె హీరోయన్ గా పాదరాయ అనే పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకుందని టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ గాయాల పాలైంది. తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ షూటింగ్ లో భాగంగా సింగర్ మంగ్లీ పాల్గొంది. ఈ చిత్రీకరణ సమయంలో మంగ్లీ కాలు జారి కింద పడింది. దీంతో ఆమె కాలికి గాయమైనట్లు సమాచారం. వెంటనే యూనిట్ సభ్యులు మంగ్లీని ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందించారు. చికిత్స అనంతరం సింగర్ మంగ్లీని కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఆమెను ప్రస్తుతం డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. మంగ్లీ గాయాలపాలైందన్న వార్తతో అభిమానులు ఆందోళన చెందారు. ఆమె డిశ్చార్చ్ అయందని తెలియడంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











