కళ్లెదుటే మరణహోమం.. సైరన్లతో వణుకు.. ఇటలీలో టాలీవుడ్ సింగర్ పరిస్థితి దారుణం

యూరప్ దేశాలను కరోనావైరస్ వణికిస్తున్నది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇటలీలో ప్రజా జీవితం అతలాకుతలం అవుతున్నది. ఇటలీలోని కరొనా మారణహోమానికి సాక్ష్యంగా నిలిచిన సింగర్ శ్వేతా పండిట్ భయంకరమైన అనుభవాలను పంచుకొన్నది. ప్రస్తుతం ఇటలీలోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న ఆమె చెప్పిన విషయాలు ఇవే..

ఇటలీలో విలయతాండవం

ఇటలీలో విలయతాండవం

ఇటలీ దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. దాదాపు 8 వేలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దినదినం అక్కడ పరిస్థితి దారుణంగా మారుతున్నది. ఇటలీ పరిస్థితులు చేజారుతున్న సమయంలో స్వీయ నిర్భంధాన్ని ప్రకటించుకొని శ్వేతా పండిట్ బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

కరోనావైరస్‌తో దారుణంగా

కరోనావైరస్‌తో దారుణంగా

తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో శ్వేత పండిట్.. ప్రపంచాన్ని కరోనావైరస్ ఎంత దారుణమైన పరిస్థితులను కల్పించిందో మీకు తెలిసింబదే. భారత్‌లో కూడా లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలుసు. అయితే ఇటలీలోని పరిస్థితులు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ప్రపంచంలో భారీగా ఎఫెక్ట్ అయిన దేశంగా ఇటలీ మొదటి స్థానంలో ఉంది అని శ్వేత తెలిపారు.

కళ్లెదుటే మరణాలు

కళ్లెదుటే మరణాలు

ప్రతీ రోజు ఉదయమే అంబులెన్స్‌ల సైరన్లతో నిద్రలేస్తున్నాను. కళ్లేదుటే మరణాలు సంభవిస్తున్నాయి. ఇదంతా వాస్తవం. నా ఆరోగ్యం గురించి పలు దేశాల నుంచి కాల్ చేసి వాకబు చేస్తున్నారు. నా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ప్రేమ వల్లనే నేను సురక్షితంగా ఉన్నా.

కరోనావైరస్‌పై వీర సైనికుల్లా పోరాటం

కరోనావైరస్‌పై వీర సైనికుల్లా పోరాటం

కరోనా వైరస్‌ను తుద ముట్టించేందుకు ప్రతీ ఒక్కరు వీర సైనికుల్లా పూనుకోవాలి. ప్రాణాంతక వ్యాధిని మనమంతా ఓడించాలి. ఇంటి వద్దనే ఉండండి. మీ చేతులను జాగ్రత్తగా వాష్ చేసుకోండి. దూరంగా ఉంటి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఫ్రెండ్స్‌తో వీడియో కాల్‌లో మాట్లాడండి. పాటలు వింటూ, సినిమాలు చూస్తూ వినోదించండి అని శ్వేత పండిట్ చెప్పారు.

Recommended Video

Watch : Rocking Star Yash Playing With Her Daughter
శ్వేత పండిట్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం

శ్వేత పండిట్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం


శ్వేత పండిట్ విషయానికి వస్తే.. బాలీవుడ్, టాలీవుడ్‌లో తన పాటలతో ఆకట్టుకొన్నారు. పద్మ విభూషణ్ పండి జస్రాజ్‌ మేనకోడలు. తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్, మహానుభావుడు, ఓం నమో వెంకటేశయ:, సైజ్ జీరో, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దమ్ము, హిందీలో సత్య 2, జంజీర్, హైవే, యమ్లా పగ్లా దీవానా, సర్కార్ రాజ్, వర్మ కి ఆగ్, కభీ అల్విదా నా కహనా చిత్రాలతోపాటు మరో 100పైగా సినిమాల్లో పాటలు పాడారు. ప్రస్తుతం ఇటలీలో ఉంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X