దండంరా నాయనా అంటూ.. ఆ రూమర్స్ కు చెక్ పెట్టిన సింగర్ సునీత

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గాయనిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ సునీత సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక విషయం తో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఆమె రెండో పెళ్లి కి సంబంధించిన వార్తలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అప్పుడప్పుడు వచ్చే తప్పుడు వార్తలపై కూడా సింగర్ సునీత క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో గురించి తప్పుగా అర్థం చేసుకొని రాసిన వార్తలపై కూడా సునీత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మంచి సింగర్ గా..

మంచి సింగర్ గా..

సంగీత ప్రపంచంలో వేలాది పాటలతో మంచి సింగర్ గా గుర్తింపును అందుకున్న సునీత అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. దాదాపు అన్ని రకాల పాటలను ఆలపించిన సునీత చాలామంది హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పారు. గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అనే పాట తో ఆమె ఇండస్ట్రీలోకి గాయనిగా అడుగు పెట్టారు.

రెండో పెళ్లి..

రెండో పెళ్లి..

ఇక ఆమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలాకాలం పాటు తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని కొనసాగించారు. ఇటీవల రెండో పెళ్లితో ఆమె మళ్ళీ సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సునీత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను కూడా తనదైన శైలిలో వివరిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. మంచి సింగర్ గా గుర్తింపును అందుకున్న సునీత లో మంచి యాంకర్ కూడా ఉన్నారు అని పలు రియాలిటీ షోలతో అర్థమైంది.

ఫొటోస్ వైరల్

ఫొటోస్ వైరల్

ఇక సింగర్ సునీత సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయాన్ని చెబుతూ తన అభిమానులకు దగ్గరవుతోంది. ఇక అప్పుడప్పుడు ఆమె పోస్ట్ చేసే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో అందంగా ఉండే సునీత ఫోటోలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే అప్పుడప్పుడు వచ్చే రూమర్స్ వార్తలపై కూడా ఆమె చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.

 సునీత తల్లి కాబోతోందని..

సునీత తల్లి కాబోతోందని..

రీసెంట్ గా సింగర్ సునీత తన ఫామ్ హౌస్లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఒక ఫోటోలో మామిడి చెట్టుకు కాసిన మామిడి కాయలు చూపిస్తూ ఆమె ఫోటో స్టిల్ ఇవ్వగా ఆ ఫోటో కూడా ఊహించని విధంగా వార్తల్లో నిలవడం విశేషం. సునీత తల్లి కాబోతుంది అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు.

 దండం రా నాయనా..

దండం రా నాయనా..

ఇక వెంటనే సునీత ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 'మై గాడ్.. పీపుల్ చాలా క్రేజీగా ఉన్నారు. నేను ఒక మ్యాంగో చెట్టుకి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేయగా.. ఇలా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు అర్ధాలతో రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ.. దండం రా నాయనా.. అని తనదైన శైలిలో సునీత తన ఫేస్ బుక్ లో క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X