హీరోలతో పాటు విరాళాలు అందిస్తున్న స్టార్ దర్శకులు.. త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్..

కుండపోత వర్షాలు, అతి భారీ వర్షాలు అనేలా కాకుండా అంతకు మించి అనేలా వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నగరవాసులు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆదుకునేందుకు ముందుకు వచ్చే టాలీవుడ్ సినీ తారలు మరోసారి వారి ఉదారతను చాటుకుంటున్నారు. ఇక హీరోలతో పాటు దర్శకులు కూడా వారికి తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు.

Recommended Video

#Hyderabad Floods Tollywood Heros Huge Donations హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్.విరాళాలు
అగ్ర హీరోలతో పాటు దర్శకులు కూడా..

అగ్ర హీరోలతో పాటు దర్శకులు కూడా..

టాలీవుడ్ లో అగ్ర హీరోలు యువ హీరోలు చాలా మంది తెలంగాణ సీఎం సహాయనిధిగా వారి వంతు సహయాన్ని అందిస్తున్న సమయంలో దర్శకులు త్రివిక్రమ్ తో పాటు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి అలాగే మరికొందరు వరద బాధితుల కోసం విరాళాలను అంధించారు. ప్రస్తుతం వారి మంచితనానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నగరం నా కళ్ళ ముందు బాధపడుతోంది

నగరం నా కళ్ళ ముందు బాధపడుతోంది

దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. భారీ వర్షాల కారణంగా నేను నివసిస్తున్న నగరం నా కళ్ళ ముందు బాధపడుతోంది. మా హైదరాబాద్‌ను తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ రిలీఫ్ వర్కర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి అండగా ఉండేందుకు నా వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను తెలంగాణ సీఎంఓకి అందిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను

కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఈ విధంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌కు జరిగిన నష్టాన్ని మనం తిప్పికొట్టలేమని ఖచ్చితంగా అనుకుంటున్నాను, కాని నేను కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను. అందుకు కాస్త సంతోషంగా ఉంటుంది. హైదరాబాద్ వరదల వల్ల బాధపడుతున్న ప్రజల కోసం నా వంతు సహాయంగా 5లక్షల రూపాయలు.. అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా..

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా..

ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సహాయంగా ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్ తో కలిసి 10లక్షల విరాళం అంధించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ రూ.కోటి 50లక్షలు ప్రకటించగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఇద్దరు చెరో కోటి రూపాయల విరాళం అందించారు. ఇక నాగార్జున, జూనియర్ వారి తరపున చెరో 50లక్షల రూపాయలని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. విజయ్ దేవరకొండ కూడా 10లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X