Tollywood Srats: టాలీవుడ్ స్టార్‌లు ఓట్లు వేసేది ఎక్కడో తెలుసా?
దేశవ్యాప్తంగా మే 13వ తేదీ అంటే రేపే లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వినియోగించుకోవడమే ఆలస్యం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ సాగబోతుంది. సామాన్య ప్రజలతో పాటు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే తెలంగాణలో ఓటు హక్కు కల్గిన స్టార్ హీరోలు, సెలబ్రిటీలు ఎక్కడెక్కడ ఓట్లు వేయబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతిలు హైదరాబాద్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ లో అల్లు అర్జున్, ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ లు ఓటు వేయబోతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేశ్‌బాబు, నమ్రత ఓటు హక్కు వినియోగించుకోకున్నారు.

నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు, చిన్న కొడుకు మంచు మనోజ్, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్ లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేయబోతున్నారు. అలాగే టాలీవుడ్ టాప్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవితా రాజశేఖర్.. దగ్గుబాటి రానా, ఆయన తండ్రి సురేష్ బాబులు.. ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల, హీరో నితిన్ లు.. జూబ్లీహిల్స్ క్లబ్ లో ఓటు వేయబోతున్నారు. అలాగే మాస్ మహారాజా రవితేజ.. జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, పెద్ద కుమారుడు, హీరో నాగ చైతన్య, చిన్న కొడుకు అఖిల్ లు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఓటు వేయబోతున్నారు. హీరో వెంకటేష్, టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందంలు మణికొండ హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఓటు వేయబోతున్నారు. హీరో రామ్ పోతినేని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో, న్యాచురల్ స్టార్ నాని గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో సుధీర్ బాబు, జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్ లు ఓటు వేయబోతున్నారు. అలాగే యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


Click it and Unblock the Notifications











