twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్స్.. షాకిస్తున్న లెక్కలు, మహేష్ నుంచి రవితేజ వరకు!

    |

    Recommended Video

    Tollywood Heroes remuneration List,Prabhas tops The List

    టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ వారసుల హవా కొనసాగుతోంది. స్టార్ వారసులుగా అడుగు పెట్టిన వారంతా స్టార్ హీరో హోదా దక్కించుకుంటున్నారు. మార్కెట్ పరంగా టాలీవుడ్ కన్నా కోలీవుడ్ పరిధి ఎక్కువనే వాదన ఉంది. కానీ తమిళ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఉన్న ప్రధాన తేడా గురించి ప్రస్తావన వచ్చింది. టాలీవుడ్ లో 100 కోట్లు వసూళ్లు సాధించే సత్తా ఉన్న హీరో 15 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ కోలీవుడ్ అదేస్థాయి హీరో 50 కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తారు.అందువలనే కోలీవుడ్ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రిక టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్స్ వివరాలు బయటపెట్టింది.

    సూపర్ స్టార్ మహేష్

    సూపర్ స్టార్ మహేష్

    సూపర్ కృష్ణ వారసుడిగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబుకు రెండు తెలుగు రాష్ట్రలో భారీ ఫాలోయింగ్ ఉంది. సరైన చిత్రం పడలేకాని మహేష్ చిత్రం వసూళ్ళలో రికార్డులు తిరగరాస్తుంది. ప్రస్తుతం భరత్ అనే నేను చిత్రంతో అదే జరుగుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం చిత్రానికి 18 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్

    టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ మంచి జోరుమీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ కూడా రూ 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

     పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

    జయాపజయాలతో సంబంధం లేని హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చిత్రాలకు వచ్చే ఓపెనింగ్స్ ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ ప్లాపుల్లో ఉన్న సమయంలో కూడా నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంతో ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. అజ్ఞాతవాసి చిత్రానికి గాను పవన్ కళ్యాణ్ 18 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

    ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్రేజీ హీరోగా మారిపోయాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు భారీ క్రేజ్ సొంతం అయింది. బాహుబలి చిత్రంతో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్నాటాలీవడ్ హీరోగా ప్రభాస్ అవతరించాడు. బాహుబలి 2 చిత్రానికి గాను ప్రభాస్ 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

    సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్ వంటి చిత్రాలతో అల్లు అర్జున్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ చిత్రాలకు కేరళలో కూడా మంచి మార్కెట్ ఉంది. బన్నీ ఓ చిత్రానికి గాను 14 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటాడు.

    మెగా పవర్ స్టార్ రాంచరణ్

    మెగా పవర్ స్టార్ రాంచరణ్

    రంగస్థలం సూపర్ సక్సెస్ తరువాత మెగా వారసుడు రాంచరణ్ జోరు మీద ఉన్నాడు. రాంచరణ్ ఓ చిత్రానికి గాను 10 నుంచి 14 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం సక్సెస్ తరువాత రాంచరణ్ రెమ్యునరేషన్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    మాస్ మహా రాజా లెక్క

    మాస్ మహా రాజా లెక్క

    కేవలం తన యాక్టింగ్, ఆటిట్యూడ్ తో రవితేజ కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. రవితేజకు ఇటీవల సరైన హిట్స్ లేకపోయినా తడి రెమ్యునరేషన్ పై ప్రభావం పడలేదని అంటున్నారు. రవితేజ రెమ్యునరేషన్ 10 కోట్లు.

    English summary
    Tollywood star heros remuneration. Mahesh Babu, Prabhas, Allu Arjun and other heros remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X