బాధితుల కోసం టాలీవుడ్ స్టార్ నైట్
వరద బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరించడం కోసం సినీ తారలు స్టార్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 7 సాయంత్రం హైదరాబాదులోని గచ్చిబౌలీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రముఖ దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావు తెలిపారు. ఆపన్నుల సహాయార్థం ఆ రోజు సినీ తారలంతా ఒకే వేదికపైకి రానున్నట్ల ఆయన తెలిపారు.
అలనాటి తారల నుంచి నేటి యువతరం వరకు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. మంగళవారం జయభేరీ క్లబ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని స్టార్ నైట్ కార్యక్రమ వివరాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి చెందినవారితో పాటు ఇంకెవరైనా వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటే.. మా అసోసియేషన్‌కు చెక్కుల రూపేణా గాని, మరే ఇతర రూపంలో గాని తమ సహాయాన్ని అందించవచ్చని మురళీ మోహన్ కోరారు.
ఎన్టీఆర్ బాలకృష్ణ మోహన్ బాబు దాసరి నారాయణ రావు వరద బాధితులు టాలీవుడ్ స్టార్ నైట్ మురళీమోహన్ floods tollywood star night gacchibowli dasari murali mohan


Click it and Unblock the Notifications