హీరో నిఖిల్ పెళ్లి ఫిక్స్: బిజినెస్‌మేన్ కూతురుతో వివాహం!
తెలుగు హీరో నిఖిల్ పెళ్లి ఫిక్స్ అయింది. తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు.
టాలీవుడ్లో మరికొన్ని రోజుల్లో నాగ చైతన్య, సమంత పెళ్లి సందడి మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం మాత్రమే కాదు, మరో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి కూడా ఫిక్స్ అయిన వార్తలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
ఆ యంగ్ హీరో మరెవరో కాదు... ఇటీవలే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి సూపర్ హిట్ అందుకున్న నిఖిల్. మరో రెండు నెలల్లో నిఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయం త్వరలో అఫీషియల్‌గా వెల్లడికానుంది.

ఈ నెలలోనే ఎంగేజ్మెంట్
ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నిఖిల్ నిశ్చితార్థం జరుగబోతోంది. ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
Recommended Video


బిజినెస్ మేన్ కూతురు
నిఖిల్ పెళ్లాడబోయేది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ బిజినెస్‌మేన్ అంజనేయులు యాదవ్ కూతురు. అమ్మాయి పేరు తేజస్విని. వీరికి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పెళ్లి ఎప్పుడు?
నిఖిల్-తేజస్విని వివాహం అక్టోబర్ 1వ తేదీన జరుగబోతోందని తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత ఈ విషయమై నిఖిల్ నుండి అధికారిక ప్రకటన రాబోతోంది. నిఖిల్ ఓ ఇంటివాడు అవుతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిఖిల్
హ్యాపీడేస్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.... ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు. ఆయన నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ చిత్రాలు మంచి విజయం సాధించాయి. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ నిఖిల్ ముందుకెలుతున్నాడు.


Click it and Unblock the Notifications











