»   » వాళ్లని చంపేయండి.... అంటూ సినీ తారల డిమాండ్!

వాళ్లని చంపేయండి.... అంటూ సినీ తారల డిమాండ్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలుగు సినిమా తారలంతా ముక్తకంఠంతో గళమెత్తారు. వాళ్లని చంపేయడమే మేలని నొక్కి వక్కానిస్తున్నారు. అలాంటి వారికి భూమిపై బ్రతికే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఇంతలా గరం అవుతున్నది ఎవరిపైనో కాదు, ఇటీవల ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కిరాతకులపై...

  ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై టాలీవుడ్ స్టార్ స్పందన...

  'అదొక భయానకమైన సంఘటన, ఢిల్లీ నగరానికే సిగ్గు చేటు. ఢిల్లీ దేశరాజధాని ఈ మధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలతో మాన భంగాలకు రాజధానిగా మారింది. నిందితులకు మరణ శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను'-మంచు విష్ణు

  'ఢిల్లీలో మరో రేప్ సంఘటన చోటు చేసుకోవడం విచారకరం. అది నా స్వస్థలం అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాను. చాలా మంది ఇదంతా..రాత్రివేళలో బయటకు వెళ్లడం మహిళల తప్పు అని చెబుతున్నారు. కూతుర్లను రాత్రిపూట బటయటకు వెళ్ల వద్దని చెప్పడం కాదు... కొడుకులకు మంచి బుద్దులు నేర్పండి'-తాప్సీ

  'రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి కేసులు ఏళ్ల తరబడి సాగకుండా త్వరిత గతిన పూర్తి కావాలి. నిందితులకు పడే శిక్షలు మరో సారి అలాంటి తప్పు ఇంకెవరూ చేయకుండా ఉండాలి'-సిద్ధార్థ

  'నిందితులకు మరణశిక్ష అయితేనే కరెక్ట్. ఇలాంటి కిరాతకులకు బ్రతికే హక్కు లేదు'-సంజన

  వీరితో పాటు ఇతర తెలుగు సినీ తారలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ముక్త కంఠంతో ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను గర్హించారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని కొందరు, మరణ శిక్ష విధించాలని కొందరు డిమాండ్ చేసారు.

  గ్యాంగ్ రేప్‌కు గురైన నిందితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో మూడు రోజుల వరకు ఆమె కండిషన్ క్రిటికల్‌గానే ఉంటుందని వైద్యులు చెప్పారు. అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, దాడి చేసిన వారు జంతువుల కన్నా ఘోరంగా ప్రవర్తించారని వైద్యులు అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కృష్ణ తీర్థ్ సఫ్తర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు.

  English summary
  Tollywood stars demand death penalty for Delhi rapists. Vishnu Manchu says..Horrible incident; Delhi Rape case. Shame on Delhi, more popular for being the Rape Capital of our country. Hope death sentence is given. Tapsi says, Really sad to know bout yet another rape case frm delhi. D nly thing I hate my city for! How some men really don't have any shame left in em. N for all who consider it a woman's fault, dnt tell ur daughters to not to step out in d nite, instead teach ur sons better.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more