twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బావ కళ్లలో ఆనందం చూడాలనే...(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ నటుడు వేణు....ఎన్నికల వేళ బావ జపం చేస్తూ ముందుకు సాగుతున్నారు. బావ కళ్లలో ఆనందం చూడటానికి ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు....ఎన్నికల సమయంలో అదును చూసి ప్రచారంలోకి దిగారు.

    ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే....ఈ సారి బావ జపం చేస్తున్న మన తెలుగు సినిమా స్టార్ల బావలంతా తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేయడమే. వారికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో.....

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. జయదేవ్ గుంటూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల బరిలోకి దిగుతున్న తన బావకు మహేష్ బాబు మద్దతు ప్రకటించారు. అలాగే ఎందుకు ప్రచారం చేయాలనుకుంటున్నారో కూడా ఆయన క్లారిఫై చేసారు. తాను రాజకీయాలకు ఇప్పటికీ దూరమే అని, అయితే ఎంపీ గా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ కోసం తాను రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు.

    బాలకృష్ణ

    బాలకృష్ణ

    టాలీవుడ్ హీరో బాలకృష్ణ తన బావ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశ్యంతో ఏకంగా రాజకీయాల్లో దిగారు. ఈ సారి ఆయన హిందూపురం లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. బావను ముఖ్యమంత్రిగా నిలబెట్టే ఎమ్మెల్యేలలో తానూ ఒకరిని కావాలని ఆయన ఆశ పడుతున్నారు.

    వేణు

    వేణు

    టాలీవుడ్ హీరో వేణు తన బావ, ఖమ్మం లోకసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావును గెలిపించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఆయన ఖమ్మంలో గుమ్మం గుమ్మం తిరుగుతున్నారు.

    అన్నయ్య పార్టీకి వ్యతిరేకంగా పవన్

    అన్నయ్య పార్టీకి వ్యతిరేకంగా పవన్

    వీరితో పాటు ఈ సారి చాలా మంది సినిమా తారలు ఈ సారి రాజకీయాల్లోకి దిగారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన జనసేన పార్టీని స్థాపించారు. అన్నయ్య చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

    English summary
    Tollywood stars Mahesh Babu, Balakrishna, Venu to Campaign for For their Brother-in laws!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X