తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన చిరు, నాగ్, అమల, రాజమౌళి, బన్నీ.. సినీ ప్రముఖులు (ఫోటోస్)

Recommended Video

Telangana Elections 2018 LIVE Updates : Chiranjeevi And His Family Cast Their Vote @Jubilee Hills

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ ఏరియాలోని పోలింగ్ బూత్‌ల వద్ద సినీ ప్రముఖులు సందడి కనిపించింది. తమతో పాటు సినీ ప్రముఖులు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చోవడంతో సామాన్యులు, అభిమానుల ఆనందంలో మునిగిపోయారు.

చిరంజీవి, నాగార్జున, అమలతో పాటు అల్లు అర్జున్ మరికొందరు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సినీ ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రతి ఒక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సూచించారు.

భార్యతో కలిసి ఓటు వేసిన చిరంజీవి

భార్యతో కలిసి ఓటు వేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూతు వద్ద మెగాస్టార్ క్యూలైన్లో నిలబడి సామాన్యుడిలాగా ఓటు వేశారు.

నాగార్జున్, అమల ట్వీట్

ఓటు వేసిన అనంతరం ఇంక్ పడిన తమ వేలు చూపిస్తూ నాగార్జున, అమల ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఓటే వేసిన రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారమే ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఆయన... తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుని మంచి భవిష్యత్ నిర్మించుకోవడంలో భాగం కావాలని సూచించారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... సామాన్యులతో పాటు లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో ఉన్న తన అభిమానులందరినీ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

గోపీచంద్ మలినేని


టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఓటు వేసిన అనంతరం తన ఇంక్ ఫింగర్ ఫోటో ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.

హీరో నితిన్

మరో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా తాను ఓటు వేసిన విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్క వినియోగించుకోవాలని అభిమానులకు సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X