టీఆర్ఎస్ హవా.... కంగ్రాట్స్ చెబుతూ టాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్!

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు ఇది. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కడతారా? లేక మహా కూటమికి పట్టం కడతారా? మరికొన్ని గంటల్లో తేలబోతోంది. అయితే ఉదయం 10.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉండటంతో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే వాదన తెరపైకి వచ్చింది. మరో వైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ గెలుపుకు సంకేతంగా తన ప్రొఫైల్ పిక్ మార్చడం విశేషం. ఈ నేపథ్యంలో పలువురు తెలుగు సినీ స్టార్స్ స్పందించారు. ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

కంగ్రాట్స్ బ్రదర్

కంగ్రాట్స్ బ్రదర్

ప్రముఖ తెలుగు సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ గెలుపుకు సూచకంగా కేటీఆర్ ఫోటో మార్చడంపై స్పందిస్తూ.... మీ గెలుపు ఖాయమని అర్థమైంది. కంగ్రాట్స్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు.

 హరీష్ శంకర్

హరీష్ శంకర్

మీరు చేంజ్ చేసిన ఫోటోలో కాన్ఫిడెన్స్ లెవల్స్ అదిరిపోయేలా ఉన్నాయి.... అంటూ కేటీఆర్‌కు అభినందన సూచకంగా దర్శకుడు హరీష్ ట్వీట్ చేశారు.

ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో...

ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అని ఏ ముహూర్తాన రాశారో కానీ మీ గురంచే రాసినట్లు ఉన్నారు సార్.. కంగ్రాట్స్ అంటూ రచయిత బివిఎస్ రవి ట్వీట్ చేశారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గెలుపుకు సంకేతంగా కేటీఆర్ పోస్టు చేసిన ప్రొఫైల్ పిక్‌ను ప్రముఖ నటి మంచు లక్ష్మి లైక్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X