చారిటీ కోసం... టాలీవుడ్ స్టార్స్ మ్యాచ్
చారిటీ కార్యక్రమం కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు టి-20 క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. టాలీవుడ్ స్టార్స్ అసోసియేషన్స్ శ్రీ విజేత గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టార్స్ క్రికెట్ 'టి-20 మ్యాచ్' జులై14న వైజాగ్‌లో వైఎస్‌ఆర్ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఈ మ్యాచ్‌కు లోగోను సోమవారం హీరో శ్రీకాంత్, తరుణ్ తదితరులు విడుదల చేశారు.
విజేత గ్రూప్ సిఇఓ సురేష్‌కుమార్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ..'వృద్ధులకు అనాధలకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో మేము ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాం. అడిగినవెంటనే సినీస్టార్స్ రావడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన సొమ్మును కొన్ని చారిటబుల్ ట్రస్ట్‌లకు ఇవ్వడం జరుగుతుంది' అన్నారు
శ్రీకాంత్ మాట్లాడుతూ...'అనాధలకు, వృద్ధులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ మ్యాచ్ ఆడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు సిసిఎల్ వగైరా మ్యాచ్‌లను ఆడుతూ వచ్చాం. ఇప్పుడు శ్రీవిజేత గ్రూప్స్ నిర్వహిస్తున్న మ్యాచ్‌లో నటీనటులంతా ఓ మంచి పని కోసం పాల్గొనడం గర్వంగా ఉందని' అన్నారు.
తరుణ్ మాట్లాడుతూ.. 'ఈ పోటీల్లో రెండు టీమ్‌లుంటాయి. ఒకటి నా టీమ్. రెండోది శ్రీకాంత్‌టీమ్. ఇప్పటికే ప్రాక్టీస్ చేశాం' అని చెప్పారు. ఈ మ్యాచ్‌లో నిర్వహణలో టాలీవుడ్ నుంచి దాదాపు 50 మంది తెలుగు సినిమా ఆర్టిస్టులు పాలు పంచుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications











