మేము సైతం: హీరోయిన్స్ డాన్స్ ప్రాక్టీస్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కలిసి ఈ నెల 30 ‘మేము సైతం' పేరుతో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్ వివిధ రకాల కామెడీ స్కిట్లు, డాన్స్ షోలు, అంత్యాక్షరి, ఇతర వినోద కార్యక్రమాలతో అలరించబోతున్నారు.

ఈ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలయ్య రెండు సాంగులకు పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అండ్ బ్యాండ్‌తో కలిసి బాలయ్య తన సింగింగ్ టాలెంట్ ప్రదర్శించబోతున్నారు. బాలయ్యతో పాటు ఇతర హీరోలు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ వినోద కార్యక్రమాల్లో పాల్గొన బోతున్నారు.

వెంకటేష్, బ్రహ్మానందం, అలీ కాజల్ కలిసి ‘పెళ్లి కాని ప్రసాద్' పేరుతో స్కిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కిట్ ప్రేక్షకులను కుడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కలిసి చేసే స్కిట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అదే విధంగా ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కలిసి మరో స్కిట్ చేస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడుతున్నారు అని సురేష్ బాబు తెలిపారు. క్రికెట్ మ్యాచ్ విషయానికొస్తే..... స్టార్స్ అంతా మొత్తం నాలుగు జట్లుగా ఏర్పడనున్నారు. ఈ జట్లకు వెంకటేష్, నాగార్జున, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

హీరోయిన్ల డాన్స్ ప్రాక్టీసుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సాన్వి డాన్స్

సాన్వి డాన్స్

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ సాన్వి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

హ్యాపీగా

హ్యాపీగా

హుదూధ్ బాధుల సహాయార్థం జరుగుతున్న ‘మేము సైతం' కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని సాన్వి అంటున్నారు.

సాన్వి

సాన్వి

తమ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు.

మనాలి రాథోడ్

మనాలి రాథోడ్

నటి మనాలీ రాథోడ్ మేము సైతం కార్యక్రమం కోసం ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

మంచి పని కోసం

మంచి పని కోసం

మంచి పనిలో తాము భాగం కావడం ఆనందంగా ఉందని అంటోంది మనాలి రాథోడ్.

శ్రీయ

శ్రీయ

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ శ్రీయ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

సాంప్రదాయ నృత్యం

సాంప్రదాయ నృత్యం

మేము సైతం కార్యక్రమంలో శ్రీయ సాంప్రదాయ నృత్యం ప్రదర్శించనుంది.

కావ్య కుమార్

కావ్య కుమార్

హృదయ కాలేయం హీరోయిన్ కావ్య కుమార్ కూడా పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది.

ప్రాక్టీస్

ప్రాక్టీస్

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ కావ్య కుమార్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

ఇషా చావ్లా

ఇషా చావ్లా

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ ఇషా చావ్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

గ్రూపు డాన్స్

గ్రూపు డాన్స్

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ ఇషా చావ్లా గ్రూపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

అక్ష

అక్ష

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ అక్ష డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

గుర్తింపు

గుర్తింపు

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ అక్ష డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం. ఈ షో ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తోందని భావిస్తోంది.

కామ్నా జఠ్మలానీ

కామ్నా జఠ్మలానీ

మేము సైతం కార్యక్రమం కోసం హీరోయిన్ కామ్నా జఠ్మలానీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X