తుఫాన్: కొందరు స్టార్సే అండగా..మిగతా వాళ్లెక్కడ?
హైదరాబాద్: ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఈ నెల 12న హుధూద్ భారీ తుఫాన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తీర ప్రాంతంలో భయంకరమైన అల్ల కల్లోలం సృష్టించింది. ముఖ్యంగా విశాఖ నగరంపై ఈ తుఫాన్ ప్రభావం భారీగా పడింది. హుదూద్ సృష్టించిన విధ్వంసానికి తాగడానికి మంచి నీరు, సరైన ఆహారం దొరకని పరిస్థితి. రవాణా వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
ఈ నేపథ్యంలో తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. పలువురు స్టార్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తెలుగు సినీ నిర్మాతల మండలి కూడా తమవంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఎలాంటి సహాయమైనా చేయడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందు ఉంటుందని నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్, సాగర్ తదితరులు ప్రకటించారు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్, కృష్ణ, విజయ నిర్మల, ప్రభాస్ లాంటి వారు మాత్రమే విరాళాలు ప్రకటించారు. అయితే తుఫాన్ వచ్చి రెండు రోజులైనా నాగార్జున, మురళీ మోహన్, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ మరికొందరు స్టార్స్ అసలు స్పందించక పోవడం చర్చనీయాంశం అయింది. వీరంతా ఎక్కడికెళ్లారు? తోటి తెలుగు వాళ్లను ఆదుకోవాల్సిన అవసరం వీరికి లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్లైడ్ షోలో ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన హీరోల వివరాలు....

పవన్ కళ్యాణ్
సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉండే పవన్ కళ్యాణ్ మరోసారి తన విశాల హృదయం చాటు కున్నారు. రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం నుండి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అభిమానులను కూడా సహాయ కార్యక్రమాలకు సన్నద్ధం చేసారు.

మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.

రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖ రామకృష్ణ మిషన్‌కు రూ. 5 లక్షలు విరాళం అందించారు. దీంతో పాటు మంచి నీరు, ఆహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హుధూద్ తుఫాన్ విలయానికి చలించి పోయారు. ప్రస్తుతం కేరళలో ఉన్న అల్లు అర్జున్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు.

జూ ఎన్ఠీఆర్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు.

ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 20 లక్షల సహాయం ప్రకటించారు.

కృష్ణ
ప్రముఖ నటుడు కృష్ణ రూ. 15 లక్షల విరాళం ప్రకటించారు.

విజయనిర్మల
కృష్ణ సతీమణి విజయం నిర్మల రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు రూ. లక్ష విరాళం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











