twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటిస్తూనే చనిపోయారు.. దీక్షితులు మాస్టారుపై తెలుగు సినీస్టార్స్!

    |

    ప్రముఖ తెలుగు సినీ, టీవీ, రంగస్థల నటుడు, యాక్టింగ్ గురు డీఎస్‌ దీక్షితులు సోమవారం సాయంత్రం నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో 'సిరిసిరి మువ్వ' సీరియల్ షూటింగులో నటిస్తూనే గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి హైదరాబాద్‌లోని దీక్షితులు నివాసానికి వేలాదిగా ఆయన శిష్యులు తరలి వస్తున్నారు. దీక్షితులు అంత్యక్రియలు తెనాలి పక్కన ఉన్న ఆయన స్వస్థలం కొల్కలూరులో దహన క్రియలు జరుగుతాయి.

    ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు

    ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు

    ‘‘దీక్షితులు మాస్టారు మరణం ఎంతో బాధించింది. నేను నటిస్తూ నటిస్తూ పోవాలని ఉందని నాగేశ్వరరావు ఎప్పుడూ అనే వారు. అది వారి విషయంలో జరుగలేదు కానీ... దీక్షితులుగారి విషయంలో జరిగింది. దీక్షితులుగారు తన జీవితాన్ని, సంపాదనను, సర్వస్వాన్ని ఆఖరు ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు. ఆయన మరణం బాధ కలిగించినా.. ఆయనకు నటనపట్ల ఉన్న అంకిత భావం ఆశ్చర్యం కలిగిస్తుంది.'' అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.

    వేల మందికి నటన నేర్పారు

    వేల మందికి నటన నేర్పారు

    దీక్షితులు మాస్టారు హఠాన్మరణం బాధించింది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో వారింట్లో ఒక బిడ్డగా చేశారు. నాలాంటి వారు కొన్ని వేల మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. భారత దేశంతో పాటు అమెరికా గడ్డమీద కూడా ఎంతో మందికి యాక్టింగ్ నేర్పారు. భోజనం పెట్టి, అక్షరాలు నేర్పి, వారు సెటిలయ్యే వరకు వెన్నంటే ఉండటం అంటే మామూలు విషయం కాదు. నటన అంటే పరితపించే ఆయన షూటింగులో డైలాగ్ చెబుతూ పోవడం సంతోషించాలో.. బాధ పడాలో అర్థం కావడం లేదు. ఇండస్ట్రీలో సుమంత్, నరేష్, సునీల్ ఇలా ఎంతో మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. తెనాలి పక్కన ఉన్న కొల్కలూరులో మాస్టారు దహన క్రియలు జరుగుతాయని... ఉత్తేజ్ తెలిపారు.

    గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్నారు

    గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్నారు

    దీక్షితులు మాస్టారుతో 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మాకు గురువు లాంటి వ్యక్తి. కొన్ని వేల మంది స్టూడెంట్స్‌కు డైలాగులు నేర్పి.. డైలాగ్ చెబుతూ చెబుతూ హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూయడం బాధాకరం. ఆయన శిష్యులు కొన్ని వందల మంది ఇక్కడకు వచ్చి గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్నారు. ఆయన స్టేజీ మీద పెద్ద ఆర్టిస్టేమో కానీ... సినిమా రంగంలో చిన్న నటుడే. అయినా ఇంత మంది హృదయాన్ని కొల్లగొట్టారంటే ఎంత గొప్పవ్యక్తో అర్థం చేసుకోవచ్చు... అని మా అధ్యక్షుడు శివాజీరాజా వ్యాఖ్యానించారు.

    ఉద్యోగం వదులుకుని వచ్చారు

    ఉద్యోగం వదులుకుని వచ్చారు

    దీక్షితులు మాస్టారు మన మధ్య లేక పోవడం బాధాకరం. ఆ నటరాజే ఆయన మనసులో ఆ ఆలోచన కల్పించారేమో... ఆయనకు ఉన్న ఉద్యోగం వదులుకుని వచ్చి, నటన శిక్షణాలయం స్థాపించి ఎంతో మందికి నటన నేర్పారు. ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్నారు. ఆయన నటిస్తూనే చనిపోవడం అనేది ఆయనలోని కళాకారునికి జోహార్లు అర్పించినట్లు ఉందని... నటుడు జయప్రకాష్ రెడ్డి అన్నారు.

    English summary
    Tollywood stars emotional words about Ds Deekshithulu. Senior Tollywood film, TV and theatre actor and renowned acting guru DS Deekshithulu (62) passed away due to heart attack monday evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X