»   »  తారల ఫేస్‌బుక్ లైకుల వెనక షాకింగ్ వాస్తవాలు?

తారల ఫేస్‌బుక్ లైకుల వెనక షాకింగ్ వాస్తవాలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tollywood stars Facebook
హైదరాబాద్: ఈ మధ్య ఫేస్‌బుక్‌ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరి పేరుపై పేజీలు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లతో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్తగా వచ్చిన నటీనటులపై కూడా ఫేస్ బుక్ పేజీలు వెలుస్తున్నాయి.

స్టార్ హీరోల ఫేస్ బుక్ పేజీలు మాత్రమే కాదు, మామూలు హీరోల పేజీలకు కూడా మిలియన్ల కొద్దీ లైక్స్ వచ్చి పడుతున్నాయి. అయితే ఈ ఫేస్‌బుక్ లైకుల వెనక ఓ పెద్ద వ్యాపారమే నడుస్తుందని తాజాగా వెలుగులోకి వచ్చిన వాస్తవం. అందరూ కాకపోయినా...కొందరు సినీ స్టార్స్ మాత్రం ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తమ పేజీలకు భారీగా లైక్స్ పెరిగేలా చేసుకుంటున్నారని టాక్.

ప్రస్తుతం దేశంలో ఫేస్‌బుక్ సోషల్ నెట్వర్కింగ్ భారీగా పెరిగిన నేపథ్యంలో తమ పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగానే భారీగా డబ్బులు చెల్లించి మరీ తమ ఫేస్‌బుక్ పేజీలకు లైకులు పెంచుకుంటున్నారట. ఇందుకోసం ఒక్కో లైక్‌కు 50 పైసలు చొప్పున చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్చేకంగా కొన్ని సంస్థలు పని చేస్తున్నాయట.

సదరు స్టార్ల ఫేస్ బుక్ పేజీలను వారే మెయింటేన్ చేస్తూ.....లైకుల సంఖ్య పెరిగేలా ఇంట్రస్టింగ్ పోస్టింగులు చేయడంతో పాటు, ఒక పేజీ నుంచి మరొక పేజీకి లైక్స్ పెరిగేలా రికమండ్ చేయడం లాంటివి చేస్తున్నట్లు సమాచారం. డబ్బుంటే ఏదైనా సాధ్యమే అని ఈ పరిణామాలను చూస్తే స్పష్టం అవుతోంది కదూ!

English summary
Tollywood stars Facebook publicity tricks Exposed. Few film celebrities are having Facebook pages and announcing that likes have crossed 1 lakh or its multiples from time to time. Well, truth is, there are companies which specialize in increasing the like count and they charge 50 paise per like.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu