మెగా ఎఫెక్ట్: దద్దరిల్లిన సోషల్ మీడియా... సీనీ స్టార్స్, ఫ్యాన్స్ కామెంట్లే కారణం!
Recommended Video

ఆయన స్టార్లకే స్టార్... టాలీవుడ్ మెగాస్టార్. ఆయన పేరు వింటే చాలు అభిమానులే కాదు సినీ స్టార్లు సైతం పులకించిపోతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో చాలా మంది ఆయన్ను చూసి ఇన్‌స్పైర్ అయినవారే. తెరపై ఆయనలాగా నటనలో, డాన్సుల్లో, యాక్షన్ సీన్లలో రఫ్పాడించాలని కలలు కంటూ....ఇండస్ట్రీ వైపు వచ్చినవారే. అంతొద్దు.. ఇది చాలు అంటూ ఆయన నుండి క్రమశిక్షణ నేర్చుకున్నవారే. కేవలం నటనలోనే కాదు... సేవా భావంలోనూ తాను మెగా స్టార్ అని నిరూపించుకున్నారు చిరంజీవి. ఫ్యాన్స్ ఉన్నది కేవలం తమకు జేజేలు కొట్టడానికి కాదని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే సమాజానికి మంచి జరుగుతుందని నిరూపించారు.

దద్దరిల్లుతున్న సోషల్ మీడియా
నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ మీద శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్ ఎక్కడ చూసినా చిరంజీవి నామస్మరణే కనిపిస్తోంది. ఆయన్ను విష్ చేస్తూ పలువురు స్టార్స్, అభిమానులు చేస్తున్న కామెంట్లతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. #SyeRaaTeaser, #HappyBirthdayChiranjeevi లాంటి యాష్ ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి.
నాగార్జున బెస్ట్ ఫ్రెండ్
ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగార్జున విష్ చేస్తూ ట్వీట్ చేశారు.
అన్నయ్యా అంటూ శ్రీకాంత్
మెగాస్టార్ చిరంజీవి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో హీరో శ్రీకాంత్ ఒకరు. చిరంజీవి ఆయన్ను తమ్ముడిలా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్నయ్యను విష్ చేస్తూ శ్రీకాంత్ ట్వీట్ చేశారు.
రాధిక
ఒకప్పుడు చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది రాధిక. చిరంజీవి ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. తన బెస్ట్ పుట్టినరోజు సందర్భంగా రాధిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
అల్లు అర్జున్
మామయ్య చిరంజీవిని విష్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్. తాజాగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ మెగాస్టార్ రేంజికి మేము రాలేమని తేలిపోయింది. కనీసం ఆయనంత మంచి మనిషి అవ్వాలని ప్రయత్నిస్తున్నామన్నారు.
దేవిశ్రీ ప్రసాద్
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ చిరంజీవిని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. సైరా టీజర్ తో కుమ్ముడు మొదలైందన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న అమిత్ త్రివేదిక ఆల్ ది బెస్ట్ తెలిపారు.
సుధీర్ బాబు
చిరంజీవిగారు మనందరికీ పెద్దన్నయ్య లాంటి వారు, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశారు.
తనకు అంత స్పెషల్ ఎందుకో వివరిస్తూ నాగ శౌర్య
చిరంజీవిగారు నాకు ఎందుకు అంత స్పెషల్ అనే విషయాన్ని నాగ శౌర్య ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఛలో వేడుకలో ఆయనతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
వంశీ పైడిపల్లి
మెగాస్టార్‌ను విష్ చేస్తూ వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. త్వరలో ఆయన మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మెగా డాటర్ సుష్మిత
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సుష్మిత ఓ ఫోటో షేర్ చేశారు. సైరా నరసింహారెడ్డికి సుష్మిత కాస్టూమ్స్ డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











