సినీతారలు లగ్జరీ ఎక్స్‌పో (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: నగరంలో ప్రారంభమైన లగ్జరీ బ్రాండ్స్ ఎక్స్‌పోలో టాలీవుడ్ తారలు సందడి చేసారు. మోహన్ బాబు కుటుంబంతో పాటు, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ హీరోలతో పాటు ఇతర స్టార్స్ ఇండియన్ లగ్జరీ ఎక్స్ పోను సందర్శించి లగ్జరీ బ్రాండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఖరీదైన కార్లు ఇండియాకు రావడం ఎంతో హాపీగా ఉందన్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి సతీమణి సురేఖ, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా ఈ ఎక్స్ పోను సందర్శించారు. వీరు ఎక్కువగా ఖరీదైన గృహాలంకరణ వస్తువులను వీక్షించారు. అదే విధంగా మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్, సినిమాటో గ్రాఫర్ చోటా కె. నాయుడు, సుబ్బరాజు తదితరులు ఈ ఎక్స్ పోను సందర్శించారు.
ప్రపంచంలోనే అత్యంత కాస్లీ బ్రాండ్స్ ఈ ఎక్స్‌పోలో కొలువుతీరి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ద ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో సంస్ధ ఈ ఎక్స్‌పోను హైదరాబాద్ ఎన్‌కన్వెన్షన్‌లో ప్రారంభించింది. ఇందులో ప్రదర్శనకు ఉంచిన టాప్ లగ్జరీ కార్ బ్రాండ్స్ కార్‌లవర్స్ చూపుతిప్పుకోకుండా చేస్తున్నాయి. కార్లేకాకుండా హోమ్‌ఫ్యాషన్, యాక్సెసరీస్, పర్సనల్ కేర్, లగ్జరీ వాచ్ బ్రాండ్స్, ఇంటీరియర్ బ్రాండ్స్ కూడా ఈ ఎక్స్‌పోలో కొలువుతీరాయి.

లగ్జరీ ఎక్స్ పోలో గృహాలంకరణ వస్తువులను పరిశీలిస్తున్న చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన

మోహన్ బాబుతో పటు తనయుడు మనోజ్, కుమార్ లక్ష్మి ప్రసన్న

ఆటో ఎక్స్ పోలో నాగచైతన్య

ఆటో ఎక్స్ పోలో స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన అక్కినేని అఖిల్

ప్రదర్శనకు ఉంచిన వస్తువులను తిలకిస్తున్న సుబ్బరాజు


Click it and Unblock the Notifications











