ప్రధాని పిలుపు.. దీపాల కాంతుల్లో తారలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుల్లితెర తారలు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. లక్షల మంది బారిన పడటంతో.. అమెరికా విలవిల్లాడుతోంది.మన దేశంలోనూ కరోనా వైరస్ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇలాంటి విపత్కర కాలంలో ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రధాని మోదీ వినూత్న కార్యక్రమానికి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video

తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు..
కరోనా వైరస్ రోజు రోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోవడం, దేశంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత ప్రజల్లో సమగ్రతను, సౌబ్రాతృత్వాన్ని పెంపొందించి.. కరోనాపై పోరాడేందుకు ఒకేత్రాటిపై ఉన్నామనే సందేశాన్ని ఇచ్చాడు. ఈ మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లోని లైట్స్ ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు.

కదిలిన టాలీవుడ్..
ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశమంతా కదలింది. ఈ మేరకు టాలీవుడ్ స్టార్స్ అంతా తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. తామంతా ఒకే త్రాటిపై ఉన్నామని దేశ సమగ్రతను చాటి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి.

మెగా, అల్లు కుటుంబాలు..
ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు స్ఫూర్తినొందిన మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులందరితో కలిసి దీపాలు వెలిగించాడు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి దీపాలు వెలిగించాడు. ఈ మేరకు వీరు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అక్కినేని ఫ్యామిలీ సైతం..
అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో పాటు దీపాలు వెలిగించాడు. విక్టరీ వెంకటేష్ కూడా దీపాలు వెలిగించి సమగ్రతను చాటి చెప్పాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, గోపిచంద్, శ్రీకాంత్ ఇలా ప్రతీ హీరో దీపాలు వెలిగించి.. ప్రధాని చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కదిలిన యంగ్ హరోలు..
యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి దీపాలను వెలిగించాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, సుధీర్ బాబు వంటివారు దీపాలను వెలిగించి ప్రధాని చేపట్టిన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో కలిసి దీపాలు వెలగించాడు.

ప్రత్యేక ఆకర్షణగా బుల్లితెర తారలు..
_అయితే ప్రతీసారి వెండితార సెలెబ్రిటీలు మాత్రం హైలెట్ అవుతుండగా.. ఈ సారి బుల్లితెర స్టార్స్ తమ సత్తా చాటారు. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క, వదినమ్మ టీమ్, మౌనరాగం టీమ్, ఆమె కథ సీరియల్ హీరో, హీరోయిన్లు, యాంకర్ సుమ దీపాలను వెలిగించి సమగ్రతను చాటి చెప్పారు.


Click it and Unblock the Notifications











