అనంతపురంలో తారల క్రికెట్ మ్యాచ్ ...!
రాయలసీమలోని అనంతపురంకు చెందిన క్రిసెంట్ సంస్థ, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా సెప్టెంబర్11న అనంతపురంలో టాలీవుడ్ తారలతో క్రికెట్‌మ్యాచ్ ను నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. క్రిసెంట్ సంస్థ అధ్యక్షుడు షకీల్ షఫి మాట్లాడుతూ' మా సంస్థ ద్వారా ప్రతి ఏడాది ఓ ఈవెంట్‌ని నిర్వహించి ఆ ఈ వెంట్ ద్వారా వచ్చే మొత్తంతో నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్ లని అందిస్తున్నాం. అయితే ఈ ఏడాది టాలీవుడ్ తారలతో క్రికెట్ మ్యాచ్ ని నిర్శహించి తద్వారా వచ్చే మొత్తాన్ని ప్రతి ఏడాది లాగే నిరుద్యోగ మహిళల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాం 'అన్నారు.
టాలీవుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగించనున్నారు. ఇది 25 ఓవర్ల టోర్నమెంట్. 25 మంది టాలీవుడ్ స్టార్లు రెండు జట్లుగా విడిపోయి టోర్నీలో పాల్గొంటారు. త్వరలోనే జట్ల వివరాలు ప్రకటిస్తామ"ని తెలిపారు. 'ఇప్పటి వరకు టాలీవుడ్ క్రికెట్ టోర్నీలు హైదరాబాద్, వైజాగ్‌లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు తొలిసారిగా అనంతపురంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని అన్నా రు.
తరుణ్ మాట్లాడుతూ' నిరుద్యోగ మహిళల సహాయార్థం నిర్శహించే ఈ మ్యాచ్ సెప్టెంబర్11న అనంతపురంలో జరుగుతుంది. 25 ఓవర్లలో జరిగే ఈ మ్యాచ్ లో తెలుగు చిత్రంకు చెందిన నటులు పాల్గొంటారు. ఈ రెండు టీమ్ లకు కెప్టెన్ లుగా ఎవరుంటారు, ఈ ఈవెంట్‌లో ఎవవరు పాల్గొంటారు అనే విషయాలు వారం పది రోజుల్లో వెల్లడిస్తాం. ఓ మంచి ప్రయత్నం కోసం నిర్వహించే ఈ కార్యక్రకమాన్ని అందరూ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను'అన్నారు. ఇంకా ఈ కార్యక్రకమంలో కథానాయకులు శ్రీకాంత్, శర్వానంద్, రాజీవ్‌కనకాల, క్రిసెంట్ సంస్థ సెక్రెటరి రామలింగాడ్డి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications