వైయస్ జగన్ పై టాలీవుడ్ స్టార్ ల ప్రశంసలు....
వైయస్ జగన్ పార్లమెంట్ శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు, అభిమానులు, వైయస్ వర్గీయులు, వివిధ పార్టీల నాయకులు, ఆయన రాజీనామపై వివిధ రకాలుగా స్పందించారు. ప్రజలు, రాజకీయ నాయకులే కాకా అటు సినీమా ఇండస్ట్రీలోనూ ప్రశంసలు కురిపించారు. అందులో దాసరి నారాయణ రావు మట్లాడుతూ, వైయస్ జగన్ చాలా శక్తిసామర్థ్యాలు గల వ్యక్తి అంతే కాకుండా అతను సోనియా గాంధీతో చాలా గౌరవంగా మెలిగాడని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం అన్నారు. మోహన్ బాబు కొడలు విరోనికా వైయస్ జగన్ కసిన్ అవుతుంది. ఆమె ద్వారా వైయస్ కుటుంబానికి సన్నిహితుడైన మోహన్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా వరస్ట్ గా వున్నాయన్నారు. అయితే వైయస్ జగన్ అటు సోనియా గాంధీని కానీ ఇతరులను కానీ అతను బ్లేమ్ చేయలేదన్నారు. 'లీడర్" చిత్రంతో పరిచయమైన దగ్గుపాటి రాణా స్నేహితుల నుండి వైయస్ జగన్ రాజీనామ గురించి తెలుసుకొని వెంటనే స్పందిస్తూ జగన్ కి ఫేవర్ గా చాలా మెసేజ్ లు ట్వీట్ చేశారు. ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఆంధ్రప్రదేశ్ కి కావాలి. అంటూ వైయస్ జగన్ మీద ఉన్న తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకొన్నాడు.


Click it and Unblock the Notifications











