»   » పవన్ స్పీచ్‌పై...సమంత, నితిన్, నాని, మంచు కామెంట్!

పవన్ స్పీచ్‌పై...సమంత, నితిన్, నాని, మంచు కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొంతకాలంగా చర్చనీయాంశం అయిన పవన కళ్యాణ్ 'జన సేన' పార్టీ రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ లక్ష్యాలను, పార్టీ ఎందుకు పెట్టాననే విషయం స్పష్టం చేసారు. దాదాపు 2 గంటల పాటు సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎన్నో విషయాలను ప్రస్తావించారు. తన వ్యక్తిగత విషయాలపై వివరణ ఇవ్వడంతో పాటు, తెలుగు వారికి అన్యాయం చేసిన రాజకీయనాయకులందరిపైనా వాగ్భాణాలు సంధించారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగంపై పలువురు సినీ తారలు తమదైన రీతిలో స్పందించారు. హీరోయిన్లు సమంత, మంచు లక్ష్మి, హీరో నాని, నితిన్, దర్శకుడు హరీష్ శంకర్, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవిలు పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగానికి సంబంధించిన సెలబ్రిటీల స్పందనలు స్లైడ్ షోలో...

సమంత

సమంత

పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎంతో గొప్పగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

పవన్ కళ్యాణ్ స్పీచ్ హార్ట్‌ఫుల్‌గా ఉంది....ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

నితిన్

నితిన్

పవన్ కళ్యాణ్ ఆదర్శంగా సినిమాల్లోకి వచ్చిన హీరో నితిన్. పవన్ రాజకీయ ప్రసంగంపై నితిన్ స్పందిస్తూ...నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. కానీ నా మద్దతు పవర్ స్టార్‌కే. జన సేన పార్టీకి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. జై పవర్ స్టార్.

కోన వెంకట్

కోన వెంకట్

జన సేన అనేది పొలిటికల్ పార్టీ కాదు. ఇదొక రాజకీయ చైతన్యం. మంచి భవిష్యత్ కోసం ఎవరైనా ఈ పార్టీలో చేరవచ్చు.

నాని

నాని

పవన్ కళ్యాన్ స్పీచ్ అదిరిపోయింది. త్వరలోనే ఆయన ప్రభావం మొదలవుతుందనే నమ్మకం ఉంది.

బివిస్ రవి

బివిస్ రవి

"నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటె వింతగా!!!! జుట్టుపట్టి రచ్చకీడ్చి నిలదీయవ నేరుగా??!?! కదల్రా !కదల్రా!కదల్రా!!ఒరేయ్!!".

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

రిటైర్ అయ్యే వయసు కాదు. కెరీర్ పరంగా టాప్‌లో ఉన్నాడు. ఆయన వస్తున్నాడు అంటే నిజంగా, నిజాయితీగా జనానికి సేవ చేద్దామనే కదా. డైనమైట్ బ్లాస్టయింది.

English summary
Tollywood stars Samantha, Lakshmi Manchu, Nani, Nithin, Harish Shankar, Kona Venkat reacted very positively to the inspiring speech of Pawan Kalyan at the launch of his party Jana Sena.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu