»   »  తగ్గించుకున్నారా? హీరోల రెమ్యూనరేషన్లలో భారీ తేడా?

తగ్గించుకున్నారా? హీరోల రెమ్యూనరేషన్లలో భారీ తేడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ ఫోర్బ్స్ ఇండియా మేగజైన్....గతేడాది తెలుగు హీరోలకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు విడుదల చేసింది. అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్లో వచ్చిన హీరోల వివరాలు చూసి సినీ ప్రేక్షకులు నోరెళ్ల బెట్టారు. వారి రెమ్యూనరేషన్ ఊహించని స్థాయిలో కోట్లలో భారీగా ఉండటమే అందుకు కారణం.

అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన హీరోల రెమ్యూనరేషన్ వివరాలు చూస్తే చాలా తేడా కనిపిస్తోంది. కొన్ని సినీ వెబ్ సైట్లు విడుదల చేసిన వివరాలకు, గతేడాది ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన వివరాలకు చాలా తేడా ఉండటాన్ని బట్టి ఇండస్ట్రీలో పరిస్థితి మారినట్లు, రెమ్యూనరేషన్లు తగ్గినట్లు కనిపిస్తోంది.

అయితే ఈ లెక్కలన్నీ కల్పితాలు...అసలైన రెమ్యూనరేషన్ల వివరాలు బయటకి తెలిసే అవకాశం లేదని, ఆ సెటిల్మెంట్లు వివిధ రకాలుగా ఉంటాయనే వాదన కూడా ఉంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించని వివరాలు...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు రూ. 23 కోట్లు తీసుకుంటున్నట్లు గతేడాది ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ ప్రకటించింది. అయితే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ 15 కోట్ల అని వినిపిస్తోంది.

మహేష్ బాబు

మహేష్ బాబు

గతేడాది ఫోర్బ్స్ లో మహేష్ బాబు 21 కోట్లు తీసుకుంటున్నట్లు వస్తే...తాజాగా 15 కోట్లు అని మాత్రమే అంటున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

గతేడాది రామ్ చరణ్ 18 కోట్లు తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. తాజాగా రామ్ చరణ్ 13 కోట్లు అని అంటున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ 17 కోట్లు తీసుకుంటున్నట్లు గతేడాది ఫోర్బ్స్ ప్రకటించింది. ఇటీవల సన్నాఫ్ సత్యమూర్తికి అల్లు అర్జున్ 11 కోట్లు తీసుకున్నట్లు టాక్.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు గతేడాది ఫోర్బ్స్ ప్రకటిస్తే...తాజాగా ఎన్టీఆర్ 13 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. కానీ భారీ ప్రాజెక్టు బాహుబలికి అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నట్లు టాక్.

రవితేజ

రవితేజ

మాస్ హీరోగా పేరున్నరవితేజ సినిమాకు రూ. 8 కోట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

బాలయ్య, వెంకీ, నాగ్

బాలయ్య, వెంకీ, నాగ్

సీనియర్ హీరోలు బాలయ్య, వెంకీ, నాగ్ సినిమాకు 6 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. కానీ ఈ లెక్కలన్నీ నిజం కాదనే వారూ లేక పోలేదు.

English summary
Checkout Tollywood stars Remuneration details.
Please Wait while comments are loading...