ఎన్టీఆర్ ఇంక్రెడిబుల్ యాక్టర్.. ఫిదా అయిన అఖిల్.. స్టార్స్ ఏమన్నారంటే!
అరవింద సమేత చిత్రం ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఫ్యాక్షన్ అంశాన్ని కథగా ఎంచుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. యుద్ధం తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే పాయింట్ తో కథని నడిపించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలు వేరు.. అరవింద సమేత చిత్రం వేరు అని ఆడియన్ అంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి అంతటివాడే త్రివిక్రమ్ సాహసానికి ఫిదా అయ్యాడు. నితిన్, సాయిధరమ్ తేజ్ వంటి స్టార్ అరవింద సమేత చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. తాజగా అఖిల్ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినట్లు తెలిపాడు.
ఫిదా అయిన అఖిల్
అరవింద సమేత చిత్ర విజయంపై అఖిల్ తాజాగా స్పందించాడు. ఎన్టీఆర్ నటనకు అఖిల్ ఫిదా అయినట్లు ఉన్నాడు. అందుకే ప్రశంసలతో ముంచెత్తాడు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అని మరోమారు ఈ చిత్రం గుర్తు చేసింది. ప్రస్తుతం ఆయన మంచి జోరుమీద ఉన్నాడు. త్రివిక్రమ్, తమన్ ని అఖిల్ ప్రశంసించాడు. తొలిసారి పూజ హెగ్డే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని గొప్ప ప్రయత్నం చేసిందని అఖిల్ తెలిపాడు.
సాహసోపేతమైన నిర్ణయం
దర్శక ధీరుడు రాజమౌళి స్పందిస్తూ.. యుద్ధం తరువాత పరిస్థితుల ఎలా ఉంటాయి అనే పాయింట్ తో కథ రాసుకోవడం త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా రాజమౌళి అభివర్ణించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన గురించి ప్రేక్షకులు చాలా కాలం మాట్లాడుకుంటారని తెలిపాడు.
చాలా రోజలుగా వెయిటింగ్
మరో హీరో నితిన్ కూడా అరవింద సమేత చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. అరవింద సమేత సూపర్ హిట్ ఓబా అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ ని ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు నితిన్ తెలిపాడు. త్రివిక్రమ్ దర్శకత్వానికి రామ్ లక్షణ్ ఫైట్స్, తమన్ సంగీతం తోడయ్యాయని తెలిపాడు.
బొమ్మ బ్లాక్ బాస్టర్
యువ హీరో నిఖిల్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ ట్వీట్ చేశాడు. గురూజీ త్రివిక్రమ్ కి, తారక్ బయ్యా కి కంగ్రాట్స్. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ నిఖిల్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











