మీరే మా గురువు.. అమితాబ్ బచ్చన్‌కు చిరు, చరణ్, ప్రభాస్, మహేష్ స్పెషల్ బర్త్ డే విషెస్

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మునుపటి లాగా కాకుండా ఈ సారి తన 78వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులతోనే చాలా కూల్ గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబులతో సహా దక్షిణాది ప్రముఖులు కూడా బిగ్ బికి స్పెషల్ విషెస్ అందిస్తున్నారు.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా..

అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా..

1969 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో మందికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సినిమా చూడని సినీ ప్రేక్షకులు ఉండరు. బాక్సాఫీస్ హిట్స్ తో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మార్కెట్ ని పెంచి అప్పట్లో అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ గా క్రేజ్ అందుకున్నారు. ఇక దాదాపు 170కి పైగాక్ సినిమాల్లో నటించిన అమితాబ్ కు మన స్టార్స్ ఈ విధంగా విషెస్ అందిస్తున్నారు.

నా ప్రియమైన బిగ్ బ్రదర్

నా ప్రియమైన బిగ్ బ్రదర్

సైరా నరసింహ రెడ్డిలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ బికి ట్విట్టర్‌లో ఈ విధంగా విషెస్ అందించారు. "నా ప్రియమైన బిగ్ బ్రదర్, ఇండియన్ సినిమా బిగ్ బి, టాలెంట్ పవర్ హౌస్, నాకు ఎప్పటికీ మార్గదర్శకంగా కాంతిని ఇచ్చేవారు మీరు, ది వన్ & ఓన్లీ అమిత్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు!. నిత్యం మీ తెలివితేటలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకా ఎన్నో జరుపుకోని మాకు స్ఫూర్తినిస్తూ ఉండాలి".. అంటూ మెగాస్టార్ వివరణ ఇచ్చారు.

రామ్ చరణ్ స్పెషల్ విషెస్

రామ్ చరణ్ స్పెషల్ విషెస్

ఇక రామ్ చరణ్ ఈ విధంగా విషెస్ అంధించారు. హ్యాపీ బర్త్ డే సీనియర్ అమితాబ్ బచ్చన్ గారు. ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండండి. ఇలాగే మీరు ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని మెగా తనయుడు తన విషెస్ అందించాడు. ఇక మెగాస్టార్ సైరా సినిమాలో అమితాబ్ గురువు పాత్రలో సెలెక్ట్ కావడానికి ముఖ్య కారణం రామ్ చరణ్. దర్శకుడికి మొదట ఆ సలహా ఇచ్చింది చిరు తనయుడే..

ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు

ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు

ఇక మహేష్ బాబు కూడా అమితాబ్ బచ్చన్ కి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ అందించారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీరు ప్రపంచంలో నాకే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇంకా అలానే కొనసాగుతున్నారు. మీరు మంచి ఆరోగ్యంతో నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సర్.. అంటూ మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

మీకు ప్రత్యేక ధన్యవాదాలు: ప్రభాస్

మీకు ప్రత్యేక ధన్యవాదాలు: ప్రభాస్

అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అమితాబ్ బచ్చన్ కి విషెస్ అందిస్తూ.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అమితాబ్ బచ్చన్ సర్.. మా అందరికి ఎంతో స్ఫూర్తినిస్తూ ఉత్తేజపరుస్తున్నన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.. అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ కథలో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X