సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన... మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్, టాలీవుడ్ స్టార్స్!
Recommended Video

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు సినీ స్టార్స్ ఈ సారి సంక్రాంతి వేడుకలను స్పెషల్‌గా జరుపుకుంటున్నారు. కొందరు ఈ పండగను తమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు సొంతూరుబాట పట్టారు.
చాలా సినిమా షూటింగులు సంక్రాంతి సందర్భంగా బ్రేక్ తీసుకున్నాయి. పండగ తర్వాత అంటే వచ్చే వారం నుంచి మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్స్ హడావుడి మొదలు కాబోతోంది. పలువురు స్టార్స్ అభిమానులకు, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు.
మహేష్ బాబు
సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. అభిమానులు, ప్రేక్షకులు అందరూ తమ కుటుంబంతో సంతోషంగా సంక్రాంతి వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
జూ ఎన్టీఆర్
‘‘భోగ భాగ్యాలు సిరి సంపదలు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు.'' అంటూ జూ ఎన్టీఆర్ పొంగల్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్' షూటింగ్ సంక్రాంతి తర్వాత తిరిగి మొదలు కానుంది.
అఖిల్ అక్కినేని
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను విష్ చేస్తూ అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను' న్యూ పోస్టర్ విడుదల చేశారు.
రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నటించిన ‘వినేయ విధేయు రామ' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే.
పాలకొల్లులో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ సొంతూరైన పాలకొల్లులో బంధువులతో కలిసి సంక్రాంతి వేడుక జరుపుకున్నారు.
సుధీర్ బాబు ట్వీట్
‘‘సంతోషం, సంపద ... మీతో పాటు మీ ఇంట్లో సందడి చేయాలని కోరుకుంటూ ... సంక్రాంతి శుభాకాంక్షలు'' అంటూ సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు.
మంచు మనోజ్
హీరో మంచు మనోజ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ చేశారు. మనోజ్ సంక్రాంతి వేడుకలను తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో జరుపుకుంటున్నారు.
జగ్గూ భాయ్
‘‘మీ ఇంట సుఖ సంతోషాలతో... సిరి సంపదలతో... పాడి పంటలతో... ఆనందంగా వుండాలి అని కోరుకుంటూ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ #మకరసంక్రాంతి శుభాకాంక్షలు.'' అంటూ జగపతి బాబు ట్వీట్ చేశారు.
కళ్యాణ్ రామ్
మకర సంక్రాంతి శుభాకాంక్షలు . ఈ పండుగ పూట మీ ఇంట సిరి సంపదలు సుఖ సంతోషాలు విలసిల్లాలని కోరుకుంటున్నాను.... అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
రవి తేజ
మాస్ మహారాజ రవితేజ ట్విట్టర్ ద్వారా సంక్రాంతి విసెస్ తెలిపారు. త్వరలో రవితేజ `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమాని `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. డిస్కో బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ పిరియాడిక్ మూవీకి `డిస్కో రాజా` అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications










