తిరుమలకు సినీతారల తాకిడి
నూతన సంవత్సర ప్రారంభమైన నేపథ్యంలో తిరుమల శ్రీవారికి సినీతారల తాకిడి ఎక్కువయింది. రెండు రోజుల క్రితం టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల, తనయుడు అఖిల్ తదితరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు నటి మీనా ఫ్యామిలీతో పాటు వచ్చి వెంకన్నకు మొక్కు తీర్చుకుంది. తాజాగా సోమవారం సినీ తారలు కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ కుటుంబంతో పాటు శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు.
వినాయకుడు ఫేం సోనియా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నటుల రాక సందర్భంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి వీఐపీలకు, ప్రముఖులకు లభించే కేటగిరీ కింద దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ నెలలో మరికొందరు తారలు కూడా తిరుమల వచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నారు. అయితే వారి వివరాలు ముందుగా చెప్పేందుకు అధికారులు నిరాకరించారు.


Click it and Unblock the Notifications











