తెలుగు సినీతారల్లో మతం మార్చుకున్న వారు వీరే (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలోని పలువురు తారలు మతం మార్చుకోవడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. పలువురు తారలు ఒక మతం నుండి మరొక మతంలోకి మారారు. జయసుధ, నయనతార, మోనికా తదితరులు ఇస్లాం, క్రైస్తవం, హిందూ ఇలా వివిధ మతాల్లోకి మారారు.
అలా మతం మార్చుకున్న పలువురు తారల గురించిన వివరాలు ఈ రోజు స్లైడ్ షోలో....

జయసుధ
హిందూ కుటుంబంలో జన్మించిన జయసుధ 2001లో క్రైస్తవం మతం స్వీకరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ....ఓ వాటర్ యాక్సిడెంట్ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

క్రైస్తవ మతం స్వీకరించిన నగ్మ
మస్లిం మదర్, హిందూ ఫాదర్‌కు జన్మించిన నగ్మ......క్రైస్తవ మతం వైపు ఆకర్షితురాలయ్యారు. క్రైస్తవ మతం స్వీకరించారు.

వైశాలి మనోహరన్
నటి, టీవీ పర్సనాలిటీ వైశాలి మనోహరన్ క్రైస్తవ మతం స్వీకరించారు.

నయనతార
క్రైస్తవ మతానికి చెందిన దంపతులకు జన్మించిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లోకి వచ్చాక తన పేరును నయనతారగా మార్చుకున్నారు. ప్రభుదేవాను ప్రేమించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం హిందూ మతం స్వీకరించారు. అయితే అనుకోకుండా పెళ్లికి ముందే ఇద్దరూ విడిపోయారు.

ఖుష్బూ
ముస్లిం కుటుంబంలో జన్మించిన నటి కుష్బూ తమిళ దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకున్నారు. ఎవరి ప్రమేయం లేకుండా తన ఇష్టప్రకారం హిందూ మతం స్వీకరించారు.

ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహహాన్ హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారారు. ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. చిన్న వయసులోనే (1989) ఆయన మతం మారారు. ఆ తర్వాత తన పేరును అల్లా రఖా రహమాన్‌గా మార్చుకున్నారు.

మోనికా
తమిళ నటి మోనికా ఇటీవలే హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారారు. మతం మార్చుకున్న తర్వాత ఆమె పేరును ఎంజి రహీమాగా మార్చుకున్నారు.

యువన్ శంకర్ రాజా
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇటీవలే ఇటీవలే ఇస్లాం మంతం స్వీకరించారు.


Click it and Unblock the Notifications











