పార్టీలేదు ఏం లేదు తొంగుంటా.. ఆపడం ఎవ్వడి వల్లా కాదు.. సెలెబ్రిటీల న్యూఇయర్ ట్వీట్స్!

2018 వెళ్ళిపోయింది.. 2019 నూతన సంవత్సరానికి వెల్ కం చెప్పాం. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. సెలెబ్రిటీలు కూడా అభిమానులకు తమకు తోచిన విధంగా విష్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి యువ హీరోలు వరుణ్, రామ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు మనోజ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఉత్తేజపరిచే విధంగా ట్వీట్ చేసాడు. రామ్ చాలా సరదాగా ట్వీట్ చేశాడు. ఇక మహేష్ బాబు మహర్షి చిత్ర సెకండ్ లుక్ తో ట్వీట్ చేశాడు.

విదేశాల నుంచి

అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ విదేశాల నుంచి అభిమానులకు స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. శిరీష్ ప్రస్తుతం లెబనాన్ అనే దేశంలో మంచు కొండల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ వీడియో ద్వారా ట్విట్టర్ లో అభిమానులని విష్ చేశాడు.

ఒక టీచర్ లాంటిది

2018 ఏడాది తనకు ఒక గురువు లాంటిది అని వరుణ్ తేజ్ తెలిపాడు. ఎన్నో విషయాలు గత ఏడాదిలో నేర్చుకున్నానని, అదే ఉత్సాహంతో నూతన సంవత్సరం 2019కి స్వాగతం చెబుతున్నాయి వరుణ్ తెలిపాడు.

పార్టీ లేదు.. తొంగుంటా

యంగ్ హీరో రామ్ చాలా సరదాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. పార్టీ లేదు ఏం లేదు.. సక్కగా జిమ్ కి పోయినామా.. వచ్చి తొంగున్నామా అంతే.. మీరు కానీయండ్రి అంటూ ట్వీట్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శత్వంలో రాబోతున్న చిత్రం కోసం రామ్ కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు.

ఆపడం ఎవ్వడి వల్లా కాదు

మార్పు అనివార్యమైనది. దానిని ఆపడం ఎవ్వడి వల్లా కాదు. ఆ మార్పు మంచిదిగా ఉండేలా చూసుకోండి. కొత్త సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాం. ప్రతి ఒక్కరు మంచి మార్పు కోసం ప్రయత్నించండి అంటూ మంచు మనోజ్ ఉత్తేజ పరిచే విధంగా ట్వీట్ చేశాడు.

365 అవకాశాలు

ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయవద్దు. ఎదో ఒకటి సాధించడానికే మనమంతా పుట్టాం. 365 అవకాశాలు రాబోతున్నాయి. వాటిని అత్యుత్తమంగా మలుచుకోండి అంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా మోటివ్ చేసే విధంగా ట్వీట్ చేశాడు.

మహేష్ మహర్షిగా

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్ర సెకండ్ లుక్ నిన్ననే విడుదలైంది. నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర యూనిట్ మహేష్ స్టైలిష్ లుక్ ని అభిమానులకు కానుకగా ఇచ్చింది. మహేష్ మహర్షి సెకండ్ లుక్ ని షేర్ చేస్తూ అభిమానులకు న్యూ ఇయర్ విషెష్ తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X