పవన్ కల్యాణ్ చేసిన సాయమే నన్ను నిలబెట్టింది.. జనసేనకు స్టంట్‌మేన్ బద్రి భూరి విరాళం
ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే.. వారిని అదుకొనేందుకు ఎంత వరకైనా వెళ్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన చేసిన సహాయాలు బయటికి తెలిసినవి కొన్ని.. బయటకు తెలియనివి చాలా ఉంటాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ తన సంపాదనలో నుంచి ప్రజల కోసం భారీగా విరాళాలు ఇచ్చి తన ఔదార్యాన్ని, ప్రజల పట్ల ప్రేమను చాటుకొంటారు. అయితే అలాంటి పవన్ కల్యాణ్‌కు తన సంపాదనను విరాళంగా ఇచ్చిన స్టంట్‌మెన్ బద్రీ ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకొంటున్నారు. ఆ విరాళం గురించిన వివారాల్లోకి వెళితే..
తెర మీద హీరోలను చూసి విజిల్స్ కొట్టించేందుకు ఫైట్స్ మాస్టర్ చేసే సాహసాలు ఊహకు అందనివిగా ఉంటాయి. అలాంటి ఫైట్ మాస్టర్లలో ఒకరు బద్రీ. తాజాగా తాను భోళా శంకర్ సినిమాకు తీసుకొన్న 50 వేల రూపాయల రెమ్యునరేషన్‌ను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకొన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని 50 వేల రూపాయల చెక్‌ను అందించారు.

సినిమాల్లో కార్లను పల్టీలు కొట్టిస్తూ చేసే డేర్ డెవిల్ స్టంట్స్ ఎంతో కష్ట సాధ్యమైనవి. సాహసంతో కూడుకున్నవి. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి స్టంట్స్ చేయడం ఫైట్ మాస్టర్ బద్రికి మాత్రమే సాధ్యం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి శ్రీ బద్రితో పరిచయం ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ బాగున్నాయని ఆయను అభినందించారు. జనసేన పార్టీకి విరాళం ఇచ్చినందుకు బద్రీకి ధన్యవాదాలు తెలిపారు.
జనసేన పార్టీకి విరాళం అందించిన తర్వాత బద్రి మాట్లాడుతూ.. 28 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన సాయమే నన్ను నిలబెట్టింది. సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు. ఎందరికో ఆయన సాయం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారు. ఆ ఆకాంక్షతోనే భోళాశంకర్ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను అని అన్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. మూడో వారాహి యాత్రను పూర్తి చేసుకొని.. నాలుగో యాత్రకు సంసిద్ధం అవుతున్నారు. త్వరలోనే OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగులు పూర్తి చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











