ఈ సమ్మర్ కి ఏ తెలుగు హీరోల మధ్యనే పోటీ అంటే...
ఈ వేసవి తెలుగు పెద్ద హీరోల సినిమాలతో మరింత వేడెక్కనుంది. వరసగా పెద్ద హీరోల నటించిన చిత్రాలన్నీ విడుదల అవుతున్నాయి. ఈ వరసలో ...ఏప్రియల్ లో పవన్‌కళ్యాణ్ నటించిన 'తీన్‌మార్" చిత్రాన్ని విడుదలచేయించేందుకు సన్నాహాలు చేయిస్తున్నారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ చిత్రాలలోనే అత్యంత భారీస్థాయి సినిమాగా చెప్పబడుతున్న 'శక్తి" వస్తుంది. వీటితో పాటు శ్రీను వైట్ల, మహేష్‌బాబు కాంబినేషన్ లో రూపొందిన దూకుడు చిత్రం అదే నెలలో రానుంది. ఇక నాగార్జున నటించిన 'రాజన్న" చిత్రం కూడా ఈ సమ్మర్‌కే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మిస్తున్న 'మిస్టర్ పర్ఫెక్ట్" చిత్రం కూడా సమ్మర్‌కే విడుదల కానుంది. అల్లు అర్జున్ నటించిన మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే 'బధ్రీనాద్" చిత్రాన్ని ఈ సమ్మర్‌కే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తీన్ మార్ పవన్ కళ్యాణ్ శ్రీను వైట్ల మహేష్ బాబు బద్రీనాధ్ శక్తి రాజన్న teen maar pawan kalyan srinu vytla mahesh babu badrinath shakti rajanna


Click it and Unblock the Notifications