టాలీవుడ్ స్టార్ క్రికెట్ లీగ్ విశేషాలు

By Bojja Kumar

విశాఖ సాగర తీరాన సినీతారల ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌ సందడిగా సాగింది. క్రికెట్ హోరుకు తోడు తారల జోరు కూడా జత కావడంతో అభిమానులంతా ఫుల్ గా ఎంజ్ చేశారు. శ్రీకాంత్ లెవెన్ జట్టు ఎనిమిది వికెట్లతో విజయం తరుణ్ జట్టుపై సాధించింది. ఇక్కడి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన టి-20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తరుణ్ జట్టు 17.2 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. తరుణ్ 19, విశ్వ 15, అయ్యప్ప 12 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాంత్ జట్టు 16.3 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో రఘు (5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు), కార్తీక్ (29 నాటౌట్) రాణించారు. రఘుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు.

సినిమాల్లో రాణించ లేకపోతున్న నందమూరి హీరో తారక రత్న క్రికెట్‌లోనూ పరుగులేమీ చేయకుండా వెనుదిరగడం గమనార్హం. శ్రీకాంత్ జట్టు తరుపున శ్రీకాంత్, అల్లరి నరేష్, శర్వానంద్, తారక రత్న, రఘు, తనీష్, సుధీర్ బాబు, కమెడియన్ ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక తరుణ జట్టు తరుపున తరుణ్, నాని, శివాజీ రాజా, రాజీవ్ కనకాల, వేణు, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.

మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంతో సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా ప్రేక్షకులను అలరించే ప్రయత్నంచేసారు. మ్యాచ్‌ చూడడం కంటే సినీ తారలను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తికనబర్చారు. కార్యక్రమానికి శివమణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికలాంగులను ఆదరించేందుకు క్రికెట్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయడాన్ని ఆమె అభినందించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X