ఆహా కోసం పవర్ఫుల్ డైరెక్టర్స్.. మొత్తం ముగ్గురు, సుకుమార్ రైటింగ్స్ కూడా
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వెబ్ కంటెంట్ కు మంచి ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ కాలంలో మంచి కంటెంట్ వస్తే ఎక్కడైనా సరే చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు పోటాపోటీగా సరికొత్త కంటెంట్స్ ను అందిస్తున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ అల్లు అరవింద్ ఆహా యాప్ ను మరింత డెవలప్ చేశారు.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీసుకుంటూ అలాగే వెబ్ సిరీస్ లను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక టాలెంటెడ్ దర్శకులతో కూడా మంచి కథలను రెడీ చేయిస్తున్నారు. అందులో వంశీ పైడిపల్లి , మారుతి, నందిని రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీరంతా గీత ఆర్ట్స్ కు ముందు నుంచి సన్నిహితంగా ఉన్నవారే.

ఇక ఆహా యాప్ కోసం వెబ్ సిరీస్ కథలను రాసే బాధ్యతను వాళ్ళకు అప్పగించారట. ఇక ఆ దర్శకులందరికి నెలసరి జీతంగా కంటెంట్ డెవలప్ చేసినన్ని రోజులు మంచి ఎమౌంట్ ఇవ్వాలని డీల్ కూడా కుదర్చుకున్నట్లు సమాచారం. సుకుమార్ రైటింగ్స్ నుంచి కూడా ఆహా యాప్ లో విభిన్నమైన కథలు రానున్నట్లు టాక్ వస్తోంది. సుకుమార్ శిష్యుల కోసం ఇప్పటికే అల్లు అరవింద్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారి నుంచి రెండు వెబ్ సిరీస్ లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఆహా యాప్ ఈ ప్లాన్ తో ఎంతవరకు తన మార్కెట్ ను పెంచుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











