టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇయర్ 'విజయ్ దేవరకొండ': ఒక్క సినిమాతో షేక్ చేసి పారేశాడు..

Recommended Video

టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇయర్ అర్జున్ రెడ్డి నే !

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో. అంతకుముందు పెళ్లిచూపులు సినిమాలో పక్కా క్లాస్ అబ్బాయిలా కనిపించిన దేవరకొండను.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డిలో ఓ డైన మైట్‌లా పేల్చాడు.

అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటన థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా చాలామందిని వదల్లేదు. అంతలా ఆ క్యారెక్టర్ చాలామందిని వెంటాడింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన విజయ్.. ఎవడే సుబ్రహ్మణ్యంలో భుజాన ఓ టేప్ రికార్డర్ వేసుకుని, అనూహ్యంగా సీన్ లోకి ఎంటరై చాలామందిని ఆశ్చర్యపరిచాడు.

ఆ తర్వాత వచ్చిన పెళ్లి చూపులుతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ జనాల చూపును కూడా తనవైపుకు తిప్పుకున్నాడు దేవరకొండ. ఏకంగా మణిరత్నం, శంకర్ లాంటి దిగ్గజ దర్శకులు కూడా దేవరకొండను తమ సినిమాల్లో నటింపజేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి.

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట గ్రామం విజయ్ దేవరకొండ స్వగ్రామం. తెలంగాణ వ్యక్తి కావడంతో సహజంగానే ఇంటర్వ్యూల్లోను, ఆడియో వేదికల్లోను తనదైన తెలంగాణ భాషనే మాట్లాడుతుంటాడు. విజయ్ మాట తీరు కూడా ఇప్పటికే చాలామందిని ఫిదా చేసింది.

tollywood talk of the year vijay devarakonda

సినిమాల్లోకి రాకముందు విజయ్ పాకెట్ మనీ కోసం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు కూడా చెప్పాడు. తన తల్లి పనిచేసే ఒక ఇనిస్టిట్యూట్ లో అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేవాడు.

హైదరాబాద్ భద్రుకా కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విజయ్.. పుట్టపర్తిలో తన స్కూలింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రస్తుతం 'ఏ మంత్రంవేశావె'తో పాటు 'ట్యాక్సీవాలా', 'మహానటి' చిత్రాల్లో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X