Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్.. అసలేం జరిగిందంటే?
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సనంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఈ కేసులో నిందితుడిగా చేరాడు. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ క్రిష్. ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును 8వ నిందితుడిగా నమోదు చేశారు. అలాగే క్రిష్ స్టేట్ మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
స్టార్ డైరెక్టర్ క్రిష్ మాత్రమే కాకుండా.. మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో అద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, సందీప్, రఘు చరణ్ లతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు మరెవరో కాదు లిషి గణేష్ కల్లు, శ్వేతలు. ఈ లిషి గణేష్ కుషిత కల్లపు వాళ్ల సోదరియే. గతంలో ఈమె పబ్ కు వెళ్లి బజ్జీలు తినేసి వచ్చామని చెప్పి వైరల్ గా మారింది. మరోసారి ఆమె చెల్లెలు డ్రగ్స్ కేసులో ఉందని వార్తలు బయటకు రావడంతో ఈ అమ్మాయిల పేర్లు మరింత హైలెట్ గా మారాయి. వీరు మాత్రమే కాకుుండా ఈ కేసులో వికేకానంద్, కేదార్, నిర్భయ్ లను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయగా... మిగిలిన నిందితులు అందరూ పరారీలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











