డ్రగ్ కేసులో డైరెక్టర్ క్రిష్‌కు రక్త, మూత్ర పరీక్షలు.. రిపోర్టులో ఏమని తేలిందంటే?

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అనేక మంది సెలబ్రిటీలు పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నటీనటులతో పాటు పలువురు బిజినెస్ మేన్ లు ఉన్నారు. అలాగే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. అయితే తాజాగా ఈయన విచారణకు పిలిచిన పోలీసులు రక్త, మూత్ర పరీక్షలు చేయించారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దాన్ని పరీక్షించారు. అయితే తాజాగా ఆ ఫలితాలు వచ్చేశాయి. అయితే అందులో ఏం తేలిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ క్రిష్ తో పాటు ఈ కేసులో మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే డ్రగ్ పెడలర్ అబ్బాస్ నీ అదుపులోకి తీసుకున్నట్లు ఇటీవలే మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ముఖ్యంగా వివేకానందకు.. అబ్బాస్ 10 సార్లు కొకైన్ డెలివరీ చేశాడని చెప్పుకొచ్చారు. అలాగే వివేకానంద, కేదార్, నిర్భయ్ లు కొకైన్ సేవించినట్లు తెలిసిందని డీసీపీ వినీత్ వెల్లడించారు. ముఖ్యంగా లిషి గణేష్ కల్లపు, శ్వేత, సందీప్ లు పరారీలో ఉన్నట్లు వివరించారు. చరణ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడని తెలిపారు.

Tollywood Top Director Krish Test Result Released on Drugs Case Check Details

అలాగే డైరెక్టర్ క్రిష్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నారని డీసీపీ వినీత్ తెలిపారు. అయితే ఈ కేసు గురించి ఆయనను విచారణకు పిలవగా వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే వీరంతా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మాత్రం తెలియదని కూడా క్లారిటీ ఇచ్చారు. క్రిష్ తో పాటు పరారీలో ఉన్న లిషి గణేష్ కల్లపు, శ్వేత, సందీప్ లకు రక్త, మూత్ర పరీక్షలు చేసి.. వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారిస్తామని అన్నారు.

చెప్పినట్లుగానే డైరెక్టర్ క్రిష్ విచారణకు ఈరోజు హాజరు అయ్యారు. ఈక్రమంలోనే పోలీసులు ఆయనకు రక్త, మూత్ర పరీక్షలు చేయించారు. అయితే మూత్ర పరీక్షలో డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. అంటే నెగిటివ్ వచ్చింది. కానీ బ్లడ్ రిపోర్ట్ మాత్రం ఇంకా రాలేదు. ఈరోజు సాయంత్రానికళ్లా ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. అయితే యూరిన్ టెస్టులో నెగిటివ్ వచ్చినప్పటికీ.. పోలీసులు ఆయనను మరోసారి విచారణకు రావాలని కోరారు. సాక్షిగా ఆయన వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X