చిరు, పవన్, చరణ్ తో పాన్ ఇండియాని మించి సినిమా.. థియేటర్లు దద్ధరిల్లె ప్లాన్ తో టాప్ డైరెక్టర్
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడో బిగ్ స్టార్స్ ఆయా ఇండస్ట్రీస్ లో కలిసి కనిపించేవారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఒకే ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ముగ్గురు టాప్ హీరోస్ కలిపి ఒకే సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ లు బద్ధలవుతున్నయి. ఇందుకు చక్కని ఉదాహరణగా తాజాగా వచ్చిన పాన్ ఇండియా సక్సెస్ చిత్రం "కల్కి 2898 ఎడి" (Kalki 2898 AD) కోసం చెప్పుకోవచ్చు.
కాగా ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కనిపించి అదరగొట్టారు. సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. ఇక ఇదిలా ఉండగా ఇలా అన్ని సినీ ఇండస్ట్రీస్ నుంచి కూడా మాసివ్ మల్టీ స్టారర్ లు చిత్రాలు వస్తున్నాయి. కానీ ఒక కుటుంబానికి చెందిన బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన మల్టీ స్టారర్స్ ఒకింత ఆసక్తిగా ఉంటాయి. కానీ ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి.
కాగా మ

కానీ ఈ తరహా కథలు మాత్రం టాలీవుడ్ లో మిగతా కుటుంబపు హీరోస్ కి పడలేదు అని చెప్పాలి. రానా, వెంకటేష్ లు రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసారు తప్పితే ఎలాంటి సినిమా చేయలేదు. కానీ అసలు మెగా మల్టీ స్టారర్ ఐడియా నా దగ్గర ఉంది అంటూ తెలుగు సినిమా టాప్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ తెలుపుతున్నాడు.
కాగా హరీష్ శంకర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన వారసుడు గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లకి తగ్గ పర్ఫెక్ట్ ఐడియా నా దగ్గర ఉంది అని హరీష్ శంకర్ తెలిపాడు. అన్ని పాన్ ఇండియా సినిమాలు అంటారు కానీ దానికి మించి వీరి మూగ్గురు మీద సినిమాపై నేను ఎప్పుడు నుంచో వర్క్ చేస్తున్నాని అని తెలిపాడు.

ఈ ముగ్గురుని కలిసి ఒక సినిమాలో చూడటం ఇప్పుడు వరకు జరగలేదు. చిరు చరణ్, చిరు పవన్ ఇలా ఇద్దరూ వేరే వేరేగా కొన్ని సినిమాల్లో కనిపించారు కానీ ముగ్గురు కలిసి కనిపించింది లేదు. అలాంటి ముగ్గురుతో కలిపి ఓ సినిమా అంటే ఆ ఊహే ఉప్పెనలా అనిపిస్తుంది.
మరి హరీష్ శంకర్ ఎలాంటి లైన్ డిజైన్ చేసాడు? ముగ్గురుతో కలిపి సినిమా చేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజతో "మిస్టర్ బచ్చన్" సినిమా చేసి రిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమాతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన రెండో సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











