ఈ వారం 'టాప్ ఫైవ్'

ఇక టాప్ ఫైవ్ కి వస్తే...కొద్ది వారాలుగా కంటిన్యూగా కలెక్షన్స్ హవా కొనసాగిస్తున్న 'కొత్త బంగారు లోకం' ఫస్ట్ ప్లేస్ లో ఉంది. యువతను...ముఖ్యంగా కాలేజీ పిల్లలను ధియోటర్స్ కి లాగుతోంది ఈ చిత్రం. అయితే నిర్మాతలు తమది ఫ్యామిలి ఎంటర్ టైనర్ అని చెప్పటానికన్నట్లు జయసుధ,ప్రకాష్ రాజు ఫొటోలను పోస్టర్స్ లో హైలెట్ చేస్తున్నారు.
రెండువ చిత్రం 'బ్లేడు బాబ్జి'...మల్టి ప్లెక్స్ లలో పెద్దగా వర్కవుట్ కాకపోయినా బి,సి సెంటర్లలలో ఈ మధ్య కాలంలో మంచి వసూళ్ళను రాబట్టుతున్న కామెడీ చిత్రం ఇది. అల్లరి నరేష్ దొంగగా నవ్వులు కురిపించి..జనాల కష్టాలని ఆ కాసేపు దోచేయటం బాగా వర్కవుట్ అవుతోంది.
మూడవ ప్లేసులో 'యువత' ఉంది. మొదట పెద్ద ఓపినింగ్స్ లేకపోయినా రాను రాను మౌత్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టుకుని నిర్మాతలుకు ఆనందాన్ని ఇస్తోంది. నికిల్ ని హీరోగా చేసే ధైర్యం చేసినందుకు వారికి మంచి లాభాలనే పంచి ఇస్తోంది. అలాగే దర్శకుడుకి కూడా రవితేజ ఛాన్స్ ఇవ్వటం సినిమా విజయాన్ని అందరూ పంచుకున్న ఫీలింగ్ కలుగు చేస్తోంది.
నాలుగవ ప్లేసులో 'ఆవకాయ బిర్యాని'...నిజానికి సినిమా బాగోపోయినా...శేఖర్ కమ్ముల పేరు జనాల్ని ఆశగా ధియోటర్స్ వైపుకు లాగుతోంది.అందులోనూ టైటిల్ చూసి ఏదో రొమాంటిక్ కామిడీ అని మరికొందరు ధైర్యం చేస్తున్నారు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కాబట్టి...ఈ సినిమా ఎంతకాలం ఇలాంటి గేమ్ తో సాగుతుందనేది దాని అదృష్టం పై ఆధారపడి ఉంటుంది. ఒకరకంగా శేఖర్ కమ్ముల సంపాదించుకుని దాచుకున్న క్రెడిట్ ని ఈ సినిమా క్యాష్ చేసుకుంటోందని చెప్పవచ్చు.
ఐదవ ప్లేసులో 'చింతకాయిల రవి' ఉంది.వెంకటేష్,అనూష్క కాంబినేషన్ ప్లస్ అయిన ఈ సినిమా కామెడీగా పేరుతెచ్చుకుంది.అలాగే ఆడియో హిట్ ఈ సినిమాకు బాగా ప్లస్ అవటంతో బి.సి సెంటర్లలో ఈ సినిమా తనదైన శైలిలో ముందుకెళ్తోంది. అయితే నిర్మాతలు భావించిన రీతిలో సినిమా హిట్టు కాదనేది సుస్పష్టం.


Click it and Unblock the Notifications











